కొంపముంచిన కూతురు... తండ్రి ఉద్యోగమే ఊష్.. ఐఫోన్ ఎక్స్ లీక్‌పై ఆపిల్ సంచలన నిర్ణయం..

Posted By:
Subscribe to Oneindia Telugu

శాన్‌ఫ్రాన్సిస్కో: ఆపిల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ కూతురు నిర్వాకం.. ఆమె తండ్రి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. అందరికంటే ముందు ఐఫోన్‌ గురించి చెప్పాలన్న ఆమె ఆరాటం.. అసలుకే మోసం తెచ్చిపెట్టింది.

ఆపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన కొత్త ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాకముందే... బ్రూక్ అమేలియా పీటర్సన్ అనే యువతి యూట్యూబ్‌లో ఆ ఫోన్ వివరాలను లీక్ చేసేసింది.

iphonex-brooke-amelia

గతవారం యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆపిల్ కంపెనీ యాజమాన్యం సదరు ఇంజినీర్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు సమాచారం.

ఆపిల్ క్యాంపస్‌ను సందర్శించేందుకు వెళ్లిన అమేలియా... లోపల ఏమేం చూసిందో అవన్నీ వీడియో డాక్యుమెంట్ రూపంలో ప్రపంచం ముందు పెట్టింది. క్యాంపస్‌లో తిరిగినంత వరకు బాగానే ఉందికానీ.. క్యాంటిన్‌లో కూర్చుని ఐఫోన్ ఎక్స్‌‌పై ఆమె మాట్లాడడమే వివాదానికి కారణమైంది.

అదే ఫోన్‌లో ఆపిల్ సంస్థ ఉద్యోగులు మాత్రమే చూడగల క్యూఆర్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా విడుదల కాని కొత్త ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించిన కోడ్‌నేమ్స్ కూడా అందులో ఉన్నట్టు కనిపిస్తోందని టెక్ మీడియా సంస్థ 'ది వర్జ్' చెబుతోంది.

వాస్తవానికి ఆపిల్ క్యాంపస్‌లో వీడియోలు తీయడం.... కొత్త ఉత్పత్తులను చిత్రీకరించడంపై పూర్తిగా నిషేధం అమలవుతున్నట్టు పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apple has reportedly dismissed an engineer after his daughter’s iPhone X hands-on video went viral on YouTube. Brooke Amelia Peterson published a vlog earlier this week, which included a trip to the Apple campus to visit her father and see an unreleased iPhone X. Peterson’s video was quickly picked up by sites like 9to5Mac, and it spread even further on YouTube. Peterson now claims her father has been fired as a result of her video. In a tearful video, Peterson explains her father violated an Apple company rule by allowing her to film the unreleased handset at Apple’s campus. Apple reportedly requested that Peterson remove the video, but it was clearly too late as the content spread further and further.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి