టెక్కీలకు షాక్: ట్రంప్ పై పోరాటం నుండి వెనక్కి తగ్గిన 'టెక్' కంపెనీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పై పోరాటానికి టెక్ దిగ్గజాలు వెనక్కి తగ్గాయి. ఏడు ముస్లిం దేశాల ప్రజలపై విధించిన వీసా బ్యాన్ పై విధించిన పోరాటం నుండి వెనక్కి తగ్గాయి టెక్ దిగ్గజ కంపెనీలు.

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు అనేకం వివాదాస్పదంగా మారాయి. అయితే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకొని విధించిన ట్రావెల్ బ్యాన్ ను టెక్ దిగ్జజ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ట్రావెలి బ్యాన్ ను ఈ కంపెనీలు న్యాయపోరాటానికి కూడ సిద్దమయ్యాయి.అయితే చివరకు ఈ కంపెనీలు న్యాయపోరాటం నుండి తప్పుకొనేందుకు సిద్దమయ్యాయి.అయితే తొలుత ట్రావెల్ బ్యాన్ విధించిన సమయంలో వ్యవహరించినట్టుగా టెక్ కంపెనీలు వ్యవహరించలేదు.

ట్రంప్ తీసుకొనే నిర్ణయాల పట్ల టెక్ దిగ్గజ కంపెనీలు కూడ బహిరంగంగానే విమర్శలు గుప్పించాయి. తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ కంపెనీలు ప్రకటించాయి.

ట్రావెల్ బ్యాన్ పై వెనక్కి తగ్గిన టెక్ దిగ్గజ కంపెనీలు

ట్రావెల్ బ్యాన్ పై వెనక్కి తగ్గిన టెక్ దిగ్గజ కంపెనీలు

ఏడు ముస్లిం దేశాల ప్రజలపై విధించిన వీసా బ్యాన్ పై ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్ తదితర టెక్ కంపెనీలు తీవ్రంగా అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఈ మేరకు న్యాయపోరాటానికి కూడ ఆ కంపెనీలు ముందుకు వచ్చాయి.అయితే ట్రావెల్ బ్యాన్ విషయమై రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ట్రంప్ తీసుకొచ్చారు.అయితే ఈ ఆర్డర్ పై పోరాటం చేసేందుకు టెక్ దిగ్గజ కంపెనీలు అంతగా ఆసక్తిని చూపడం లేదని సమాచారం. అయితే ట్రంప్ జారీ చేసిన సెకండ్ వెర్షన్ ఆర్డర్ పై న్యాయపోరాటం చేసే విషయమై దాఖలు చేసిన పిటిషన్ పై ఒకటి రెండు కంపెనీలు మినహ ఇతర కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేయలేదని సమాచారం.

పోరాటం నుండి తప్పుకొన్న 60 సంస్థలు

పోరాటం నుండి తప్పుకొన్న 60 సంస్థలు

ట్రావెల్ బ్యాన్ పై ట్రంప్ తీసుకొన్న నిర్ణయాన్నినిరసిస్తూ న్యాయపోరాటానికి ముందుకు వచ్చాయి టెక్ కంపెనీలు.అయితే రెండవ వర్షన్ ఆర్డర్ పై న్యాయపోరాటానికి గాను కొన్ని కంపెనీలు ఆసక్తిని చూపడం లేదు.దీంతో సుమారు 60 కంపెనీలు ఈ పోరాటం నుండి తప్పుకొన్నాయి.

న్యాయపోరాటం చేసే పిటిషన్ పై సంతకం చేయని టెక్ దిగ్గజాలు

న్యాయపోరాటం చేసే పిటిషన్ పై సంతకం చేయని టెక్ దిగ్గజాలు

సిలికాన్ వ్యాలీ కంపెనీల తరపున మంగళవారం నాడు హవాయి ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మైక్రోసాఫ్ట్, ఈబే, ఇంటెల్ కార్ప్, నెట్ ప్లిక్స్, ట్విట్టర్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలు సంతకం చేయలేదని సమాచారం.అయితే ఈ పోరాటంలో ఉన్న ఎయిర్ బీఎన్ బీ డ్రాప్ బాక్స్ , కిక్ స్టార్ లాంటి ఇతర కంపెనీలు కొన్ని తాజా పిటిషన్ పై కూడ సంతకాలు చేశాయి.

స్పందించేందుకు నిరాకరించిన టెక్ కంపెనీలు

స్పందించేందుకు నిరాకరించిన టెక్ కంపెనీలు

ట్రంప్ రెండవ బ్యాన్ ఆర్డర్ లో కూడ ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ తదితర ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన దావాను సమర్తించకూడదని 58 టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించుకొన్నాయని తెలుస్తోంది.అయితే ఈ వార్తలపై ఆపిల్, గూగుల్, ఈ బే, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ , నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు మాత్రం ఈ విషయమై మాట్లాడేందుకు నిరాకరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apple Inc, Alphabet Inc's Google and Facebook Inc are among more than 60 technology companies that appear to have backed away from the legal fight against U.S. President Donald Trump's controversial travel ban, deciding not to put their weight behind a lawsuit seeking to block the second version of his executive order.
Please Wait while comments are loading...