వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14ఏళ్లకే తండ్రై.. 29ఏళ్ల తల్లిని నానమ్మను చేశాడు!

|
Google Oneindia TeluguNews

బ్యూనస్‌ఎయిర్స్: భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలే బాల్య వివాహాలకు దూరంగా ఉంటుండగా.. అభివృద్ధి సాధించిన అర్జేంటీనాలో మాత్రం మైనర్ బాలబాలికలే తల్లిదండ్రులవుతున్నారు. తాజాగా ఓ 14ఏళ్ల బాలుడు తండ్రై.. అతని 29ఏళ్ల తల్లిని నానమ్మను చేశాడు.

వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలోని శాన్‌రాఫెల్‌ నగరానికి చెందిన లూసియా పాస్టెనెజ్‌ (29) చిన్నతనంలో వివాహం కాకుండానే నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరి పుట్టుకకు కారణమైనవాడు మాత్రం తప్పించుకున్నాడు.

argentina

దీంతో ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆ పిల్లలను పెంచుతోంది. అయితే ఆమె చేసిన తప్పునే ఆమె 14ఏళ్ల కొడుకు కూడా చేశాడు. స్కూల్‌కు వెళ్లే వయస్సులోనే ఓ బాలికతో జత కట్టి ఓ శిశువుకు జన్మనిచ్చాడు. అయితే తన కొడుకును ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయనని, అతడికి అండగా నిలబడతానని అతని తల్లి ఫాస్టెనెజ్ చెప్పింది.

‘చిన్న వయసులోనే పేరెంట్‌గా మారడం ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. నేను అది అనుభవించాను. ఇప్పుడు నా కొడుకూ అదే తప్పు చేశాడు’ అని వాపోయింది. అయితే ‘వాడి విషయంలో నేను జోక్యం చేసుకోను. వారికి అండగా ఉంటాను. అతడి ఉన్నత చదువుకు సహకరిస్తాను. కానీ, టీనేజ్‌లో ఉండగానే తండ్రిగా మారడాన్ని మాత్రం సమర్థించను' అని ఫాస్టెనెజ్‌ పేర్కొంది.

English summary
Countries like India have from years now been trying to do away with child marriages but recently a 14-year-old boy from Argentina has been in the news for becoming a father at the tender age of 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X