Sudan: సూడన్‍లోని పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌ను ఆక్రమించుకున్న సాయుధ దళాలు..
పోలీయో, మీజిల్స్‌తో సహా పలు వ్యాధుల నమూనాలను కలిగి ఉన్న సుడాన్‌లోని జాతీయ ప్రజా ప్రయోగశాలను సాయుధ బలగాలు ఆక్రమించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. అక్కడ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించారని ఆందోళన వ్యక్తం చేసింది. సాయుధ బలగాలు ల్యాబ్ నుంచి టెక్నీషియన్లందరినీ తరిమికొట్టారని.. ఇది పూర్తిగా సైనిక స్థావరం మారిపోయిందని సూడాన్‌లోని WHO ప్రతినిధి నిమా సయీద్ అబిద్ తెలిపారు.
బలగాలు అక్కడి నుంచి వీలైనంత త్వరగా నిష్క్రమించాలని ఆయన కోరారు. సాయుధ బలగాల్లోని ఓ వర్గం సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌ను ఆక్రమించిందన్నారు. సుడానీస్ సాయుధ దళాలు, దేశం RSF పారామిలిటరీ సమూహం మధ్య ఒక వారానికి పైగా తీవ్ర పోరాటం కొనసాగుతోంది. 10 రోజుల పట్టణ పోరాటం తర్వాత సూడాన్‌లో పోరాడుతున్న జనరల్‌ల మధ్య US మధ్యవర్తిత్వంతో 72 గంటల కాల్పుల విరమణ అధికారికంగా అమల్లోకి వచ్చింది.

"కేంద్ర పబ్లిక్ హెల్త్ ల్యాబ్ క ఆక్రమణతో సంబంధం ఉన్న భారీ జీవసంబంధమైన ప్రమాదం ఉంది" అని అబిద్ చెప్పారు.
ల్యాబ్‌లో మీజిల్స్, పోలియో, కలరా వంటి ప్రాణాంతక వ్యాధుల శ్రేణికి చెందిన ఐసోలేట్‌లు లేదా నమూనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. యుఎన్ హెల్త్ ఏజెన్సీ కూడా పోరాట సమయంలో ఆరోగ్య సంరక్షణపై 14 దాడులను ధృవీకరించిందని, ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించారని చెప్పారు. "రసాయన ప్రమాదాలతో పాటు, పనిచేసే జనరేటర్లు లేకపోవడం వల్ల బయో-రిస్క్ ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి" అని అబిద్ చెప్పారు.
సూడాన్ లో మరణించిన వారి సంఖ్యను 459గా ఉందని.. మరో 4,072 మంది గాయపడ్డారు WHO మంగళవారం తెలిపింది.వేలాది మంది ఇప్పటికే దేశం విడిచి నుంచి పారిపోయారు. 270,000 మంది ప్రజలు సుడాన్ నుంచి పొరుగున ఉన్న చాద్, దక్షిణ సూడాన్‌లకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని U.N శరణార్థి ఏజెన్సీ తెలిపింది. చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాలకు వెళ్లే సంఖ్యలకు సంబంధించి ఇంకా సరైన లెక్కలు లేవని UNHCR తెలిపింది.
మరోవైపు సూడన్ లో చిక్కున్న భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ కావేరి కొనసాగుతోంది. ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్ ప్రకారం, సూడాన్‌లో దాదాపు 2,800 మంది భారతీయ పౌరులు ఉన్నారు. దాదాపు 1,200 మంది అక్కడ స్థిరపడిన వారున్నారు.భారత నావికాదళానికి చెందిన INS సుమేధ పోర్ట్ సూడాన్‌లో ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications