భారత్‌ను నిరోధించేందుకు 130అణ్వాయుధాలతో పాక్!

న్యూయార్క్: ఏ క్షణంలోనైనా భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ 110-130 అణ్వాయుధాలతో సిద్ధంగా ఉందని అమెరికా పేర్కొంది. భారత్‌ను నిరోధించేందుకు పాక్ అణ్వాయుధ సామాగ్రిని కుప్పలుగా సమకూర్చుకుంటోందని, కొనుగోళ్లు, తయారీ ద్వారానే వాటి సంఖ్యను పెంచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ఓ నివేదికలో వెల్లడించింది.

అంతేగాక, ఇస్లామాబాద్ దాడి నిరోధక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపింది. ఒక వేళ పాకిస్థాన్‌పై సైనిక చర్య చేపడితే దానిని అడ్డుకుని, నిరోధించేందుకు 110-130 వరకు అణ్వాయుధాలు పాక్ వద్ద సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. అంతకంట ఎక్కువ ఆయుధాలు కూడా ఉండొచ్చని తెలిపింది.

Around 130 Pak nuclear warheads aimed at deterring India: US govt report

అమెరికాకు చెందిన కాంగ్రెషెనల్ రీసెర్చ్ సర్వీస్(సిఆర్ఎస్) అనే సంస్థ ఈ తాజా వివరాలను వెల్లడించింది. భారత్‌లో కూడా అణ్వాయుధ సామాగ్రి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య పోటీ ఏర్పడి అదొక కొత్త సమస్యకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

తాము అణ్వాయుధాలు గల దేశంగా ప్రపంచానికి విశ్వాసం కలిగించేందుకు ఇప్పటికే పలుమార్లు పాక్ తన అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించిందని కూడా వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+