స్కూల్ భవనంలో నక్కిన 400 మంది.. బాంబులతో విరుచుకుపడ్డ రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడి కొనసాగుతోంది. స్కూల్, కాలేజీ, థియేటర్ అని కూడా చూడకుండా దాడికి తెగబడుతుంది. తీర ప్రాంతం మెరియుపోల్‌ వద్ద గల స్కూల్‌పై దాడి చేసింది. దాడి జరిగిన సమయంలో అందులో 400 మంది ఆశ్రయం పొందుతున్నారు. జనం ఉన్నారని తెలిసి కూడా దాడి చేయడం సరికాదు. ఈ దాడిలో ఎవరూ గాయపడ్డరనే అంశం సమాచారం తెలియలేదు. భవనం మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయింది. అందులో ఉన్నవారు చిక్కుకుని కనిపించారు.

పుతిన్ సొంత గడ్డ రష్యాలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. కొంత బయటకు వచ్చినా.. మరికొంత రావడం లేదు. అయితే రష్యాలో నిరసన చేస్తోన్న వారిపై ఉక్కుపాదం మోపారు. ఉక్రెయిన్ పై దాడికి సంబంధించి వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యన్లలో చాలామంది వ్యతిరేకించారు.. వ్యతిరేకిస్తున్నారు కూడా. రష్యాలో పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. రష్యా మీడియాలోని ఓ వర్గం కూడా పుతిన్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది.

Art school housing 400 refugees bombed in Ukraines Mariupol

పుతిన్‌పై రష్యాలో నిరసనలు వెల్లువెత్తడం ప్రకంపనలు రేపుతోంది. అక్కడి తిరుగుబాటు తప్పదా అనే సంకేతాలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతు పెరుగుతుందా అనే సందేహాం కలుగుతుంది. అలాగే ఇటీవల పుతిన్ ప్రసంగిస్తోండగా ప్రభుత్వ టీవీ లైవ్ కూడా నిలిచిపోయింది. దీంతో ఏం జరుగుతుందోననే సందేహాం కలుగుతుంది. అక్కడ వ్యతిరేక పవనాలు ప్రారంభం అయ్యాయని అర్థం అవుతుంది. కానీ దానిని అణచడం మాత్రం పుతిన్ వల్ల కాదెమో అనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+