వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీంతో ఎక్కడైనా ఔషధాలు తయారు చేయొచ్చు : కృత్రిమ ఆకును అభివృద్ధి పరిచిన పరిశోధకులు

ఔషధాల తయారీకి ఆకు రూపంలో ఉండే సరికొత్త పరికరాన్ని నెదర్లాండ్స్ లోని ఐందోవెన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: అతి చౌకగా, సాధారణ ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఔషధాల తయారీకి ఆకు రూపంలో ఉండే సరికొత్త పరికరాన్ని నెదర్లాండ్స్ లోని ఐందోవెన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

సూర్యుడి నుంచి ఆకులు శక్తిని గ్రహించే సహజసిద్ధమైన ప్రక్రియ నుంచి స్ఫూర్తి పొంది వారు ఈ కృత్రిమ ఆకును సృష్టించారు. సూర్యుడి నుంచి శక్తిని గ్రహించే లుమినిసెంట్ సోలార్ కాన్సంట్రేటర్స్ (ఎల్ఎస్సీ) అనే కొత్త పదార్థంతో దీనిని రూపొందించారు.

ఈ పదార్థంలో ఉండే అతి సున్నిత కణాలు పెద్ద మొత్తంలో సూర్యకాంతిని గ్రహిస్తాయని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన తిమోతి నోయెల్ తెలిపారు. ఈ పరికరాన్ని మినీ ఫ్యాక్టరీగా వ్యవహరిస్తున్నారు.

Artificial Leaf Created by Scieentists Can Be Mini Drug Factory

ఈ కృత్రిమ ఆకు సౌరశక్తితో పనిచేసే మైక్రో కెమికల్ రియాక్టర్ అని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యకాంతిని ఉపయోగించి రసాయన ఉత్పత్తులు తయారు చేయాలన్నది పరిశోధకుల కల.

ప్రకృతి ప్రసాదించే సూర్యకాంతిలో తక్కువ శక్తి ఉంటుందని, అయితే తాము రూపొందించిన ఆకుతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు. ఎల్ఎస్సీలో ఉండే సిలికాన రబ్బర్ లోని కణాలు సూర్యకాంతితో రసాయనిక చర్య జరుపుతాయన్నారు.

ఔషధాల తయారీకి సంబంధించి ప్రయోగశాలలో వెల్లడయ్యే ఫలితాలను దీనితో సాధించామని, దీంతో మార్స్ గ్రహంపై ఉన్నా, దట్టమైన అడవిలో ఉన్నా ఔషధాలను తయారు చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

English summary
Researchers have found a way to make drugs using a sun-powered artificial leaf. The prototype reactor is inspired by real leaves, which turn sunlight into food through photosynthesis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X