వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: అమెరికాలో 1లక్ష మంది బలి.. అన్నంతపని చేసిన ట్రంప్.. చైనాకు భారీ షాక్..

|
Google Oneindia TeluguNews

''అన్ని చోట్లా మద్యం దుకాణాలు తెరిచారు. ఆడవాళ్లు అబార్షన్ చేయించుకోడానికి ఆస్పత్రులు కూడా నడుస్తున్నాయి. అలాంటప్పుడు, ప్రార్థనా మందిరాలు తెలిస్తే తప్పేంటట? నేను ఆదేశిస్తున్నాను.. మీమీ రాష్ట్రాల్లో అన్ని చర్చిలు, మసీదులు, ఆలయాలను వెలంటనే తెరవండి.. ''అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. చాలా సార్లు అబార్షన్లపై నోరు పారేసుకున్న ఆయన.. మరోసారి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ, మద్యానికి-మందిరాలకు లింకు పెట్టి విమర్శలపాలయ్యారు.

కరోనా లాక్‌డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..కరోనా లాక్‌డౌన్: జగన్ మరో సంచలనం.. ఆ తప్పులకు విచారణ లేదు.. జరిమానా, వ్యక్తిగత హామీతో సరి..

 కేసులు పైపైకి..

కేసులు పైపైకి..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో కంట్రోల్ లోకి వచ్చేలా లేదు. గతవారం 50 రాష్ట్రాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు పున:ప్రారంభం కావడంతో జనం రోడ్లపైకి వచ్చేశారు. ప్రార్థనా మందిరాల వంటి పబ్లిక్ గ్యారింగ్స్‌పై నిషేధంతోపాటు ఫిజికిల్ డస్టెన్సింగ్ రూల్స్ అమలులో ఉన్నా కేసుల సంఖ్య పైపైకే పోతున్నది. ఆదివారం నాటికి అక్కడ మొత్తం కేసులు 16.67లక్షలకు పెరిగాయి. అందులో 4.47లక్షల మంది మాత్రమే వ్యాధి నుంచి కోలుకోగా, 11లక్షలపైచిలుకు కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. కేసుల విషయంలో అమెరికా తర్వాత బ్రెజిల్(3.50లక్షలు), రష్యా(3.35లక్షలు) కొనసాగుతున్నాయి.

అక్షరాలా లక్ష మంది బలి..

అక్షరాలా లక్ష మంది బలి..

వైరస్ విలయతాండం చేస్తోన్న అమెరికాలో కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉంది. గడిచిన 24 గంటల్లోనే 1127 మంది చనిపోయినట్లు జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. మొత్తంగా కరోనా కాటుకు బలైపోతున్నవాళ్ల సంఖ్య 1లక్షకు దగ్గరైంది. ఆదివారం వారం నాటికి ఈ సంఖ్య 98,700గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 3.44లక్షలకు పెరిగింది. అమెరికా తర్వాత అత్యధికంగా 36,678 మరణాలతో బ్రిటన్ రెండో స్థానంలో ఉంది.

గవర్నర్లకు ట్రంప్ వార్నింగ్..

గవర్నర్లకు ట్రంప్ వార్నింగ్..

కరోనా లాక్ డౌన్ పై తొలి నుంచీ విముఖత ప్రదర్శించిన ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. మరణాల సంఖ్య లక్షకు చేరువైనా తన పంథాను మార్చుకోలేదు. మద్యం షాపులు, అబార్షన్ ఆస్పత్రులను సాకుగా చూపి.. ప్రార్థనా మందిరాలను కూడా తెరవాలంటూ గవర్నర్లపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత వీకెండ్ లోనే చర్చిలు, మసీదులు, ఆలయాలను రీఓపెన్ చేయాలని ట్రంప్ పిలుపిచ్చినప్పటికీ రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రముఖ చర్చిలు, సంఘాలు, మత గురువులు సైతం ట్రంప్ తరును తప్పుపట్టారు. రాజకీయా లబ్దికోసం మతాలతో ఆటలాడుకోవద్దని హితవు పలికారు. ఇదిలా ఉంటే..

33 చైనా కంపెనీలపై నిషేధం..

33 చైనా కంపెనీలపై నిషేధం..

కరోనా వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి చైనాయే కారణమంటోన్న డొనాల్డ్ ట్రంప్.. ఐక్యరాజ్యసమితి ద్వారా డ్రాగన్ దేశంపై ఒత్తిడి పెంచుతుండటం తెలిసిందే. మరోవైపు దేశీయంగానూ అమెరికాలో చైనా కంపెనీలను కట్టడిచేసే ఎత్తుగడను ఆయన వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకున్న బిలియన్ డాలర్ల యుఎస్ పెన్షన్ నిధులను ఉపసంహరించుకున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు ఏకంగా 33 చైనా కంపెనీలను. వాటి అనుబంధ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు రెడీ అయింది.

Recommended Video

Lockdown : Big Relief To AP People,No Need Passes To Travel In AP
 అవి ఏ కంపెనీలంటే..

అవి ఏ కంపెనీలంటే..

అమెరికాలో నిషేధానికి గురవుతోన్న 33 చైనీస్ కంపెనీలూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి చెందినవే కావడం గమనార్హం. సదరు కంపెనీలు సొంతదేశమైన చైనాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని, తప్పుడు పద్ధతుల్లో చైనీస్ ఆర్మీకి సాయం చేస్తున్నాయని, అందుకే వాటిని అమెరికాలో నిషేధించాలనుకుంటున్నట్లు యుఎస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లో చైనాను అన్ని రకాలుగా అడ్డుకుంటానన్న ట్రంప్ ఆ దిశగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

English summary
coronavirus pandemic's death toll approached 100,000 in the U.S. President Donald Trump, deeming houses of worship “essential places that provide essential services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X