వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా ఎఫెక్ట్: స్టాక్‌ మార్కెట్లకు భారీ నష్టాలు, పడిపోయిన రూపాయి విలువ

పసిఫిక్‌లో అణు ఆయుధాలను పరీక్షించగలమని ఉత్తరకొరియా హెచ్చరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై : ఉత్తరకొరియా మరోసారి స్టాక్‌ మార్కెట్లను ముంచింది. కొరియా హెచ్చరికలతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 32,169 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం తన కీలక మార్కు 10,100ను కోల్పోయి, 71.95 పాయింట్ల మేర నష్టపోతూ 10,049 వద్ద కొనసాగుతోంది.

పసిఫిక్‌లో అణు ఆయుధాలను పరీక్షించగలమని ఉత్తరకొరియా హెచ్చరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులు 0.4 శాతం నుంచి 1 శాతం మేర పడిపోతున్నాయి.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.7 శాతం చొప్పున డౌన్‌ అయ్యాయి. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, గ్రాఫైట్‌ ఇండియా, జేపీ అసోసియేట్స్‌, పీటీసీ ఇండియా, మ్యాట్రిమోనీ.కామ్‌లు 4 శాతం వరకు నష్టపోయా​యి.

Asian markets rattled by latest North Korean nuclear threat

అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 82 పైసలు నష్టపోయి 65కి పైన ట్రేడవుతోంది. బంగారం ధరలు కూడా ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో 216 రూపాయల నష్టంలో 29,558 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి.

భారీగా పడిపోయిన రూపాయి విలువ...

అమెరికా డాలర్‌తో పోల్చినపుడు రూపాయి విలువ శుక్రవారం నాలుగు నెలల క్రితం స్థాయికి పడిపోయింది. దిగుమతిదారులు, బ్యాంకులు డాలర్ కోసం పోటీ పడటంతో రూపాయి విలువ 31 పైసలు కోల్పోయి, ఒక డాలర్‌కు రూ. 65.12 పలికింది.

గురువారం రూపాయి విలువ డాలర్‌కు రూ. 64.81 పలికింది. దేశీయ ఈక్వటీ మార్కెట్లు, విదేశీ నిధుల ప్రవాహం వల్ల రూపాయిపై భారం పడిందని డీలర్లు చెప్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు రేటు వచ్చే డిసెంబరులో పెరిగే అవకాశం ఉన్నట్లు వస్తున్నవార్తల ప్రభావం కూడా రూపాయిపై పడిందని అంటున్నారు.

English summary
Equity markets across the Asia-Pacific region were down on Friday, with stocks in Japan reversing early gains following fresh threats from North Korea, while China-related stocks declined on a credit-rating downgrade.North Korean Foreign Minister Ri Yong Ho said late Thursday in New York that the country may consider a nuclear test of “unprecedented scale” in the Pacific Ocean, according to South Korea’s Yonhap News Agency.Those comments came shortly after North Korean leader Kim Jong Un said he was considering the “highest level of hard-line countermeasure” in response to President Donald Trump’s warning that the U.S. would annihilate North Korea if forced to defend itself or its allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X