పాకిస్తాన్ లో మిలటరీ పాలన ? రక్షణమంత్రి సంచలనం..!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ఆపరేషన్ లో భారీగా ఎదురుదెబ్బలు తిన్న పాకిస్తాన్ వ్యూహాత్మకంగా రూటు మార్చింది. తమ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ ఇచ్చింది. భారత్ పై విజయం సాధించినందుకు ఈ ప్రమోషన్ ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం చెప్పుకుంది. తద్వారా తమ ఓటమిని కూడా దేశ ప్రజల దగ్గర విజయంగా చెప్పుకుంది. ఇదే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కొంపముంచుతోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణ జరిగింది. దీని తర్వాత ఆసిమ్ మునీర్ కు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ గా ప్రమోట్ చేసింది. దీంతో అమెరికాతో పాటు పలు దేశాలు ఆసిమ్ మునీర్ కు ప్రాధాన్యం అమాంతం పెంచేశాయి. ఇదే అదనుగా పాకిస్తాన్ లో గతంలో పని చేసిన పలువురు ఆర్మీ ఛీఫ్ ల తరహాలోనే తాను కూడా పట్టు సాధించేందుకు ఆసిమ్ వేగంగా పావులు కదిపాడు. ఈ ప్రయత్నాలు కూడా ఫలించినట్లే తెలుస్తోంది. పైకి అక్కడ ప్రజా ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తున్నా తెరవెనుక నడుపుతోంది అంతా ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీరేనని అర్ధమవుతోంది.

ఇదే విషయాన్ని ఇప్పుడు దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా అంగీకరించారు. దేశంలో ప్రస్తుతం మార్షల్ లా కొనసాగుతోందని ఆయన తాజాగా ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరైన సందర్భంగా పలువురితో వ్యాఖ్యానించినట్లు భారత్ కు సమాచారం అందింది. ఆర్మీఛీఫ్ తో భేదాభిప్రాయాలపై అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆర్మీ చీఫ్‌తో విభేదాలు తలెత్తితే నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారా తీసుకుంటామన్నారు. ఇది ఆచరణాత్మక అవసరం అని తేల్చేశారు. దీంతో ఆర్మీఛీఫ్ ను తొలగించే పరిస్దితుల్లో తాము లేమని అంగీకరించారు.

అంతే కాదు పాకిస్తాన్ కు నిజమైన పాలకుడు ఆర్మీఛీఫ్ ఆసిమ్ మునీర్ అంటూ ఖవాజా ఆసిఫ్ అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ లో మార్షల్ లా కొనసాగుతుందని ఆయన తేల్చేశారు. ఆర్మీ ఛీఫ్ తో భేదాభిప్రాయం వస్తే ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం చూస్తుంటే తమ వద్ద ఎలాంటి అధికారం లేదని చెప్పినట్లయింది. దీంతో ప్రస్తుతానికి అక్కడ సైనిక మద్దతుతో పైకి కనిపించే హైబ్రిడ్ ప్రభుత్వం నడుస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications