• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాంబు పేల్చిన ఆస్ట్రాజెనెకా: వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్: ట్రయల్స్ బ్రేక్: బెడిసికొట్టినట్టేనా?

|

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. భారత్ సహా పలు ఏడెనిమిది దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్‌గా గుర్తింపు పొందింది బ్రిటన్-స్వీడిష్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆస్ట్రాజెనెకా. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాల దశలో ఉంది. రెండు, మూడు దశల్లో ట్రయల్స్ కొనసాగుతున్నాయి. త్వరలోనే అందుబాటులోకి వస్తోందని భావిస్తోన్న తరుణంలో.. బాంబు లాంటి సమాచారాన్ని పేల్చింది ఆస్ట్రాజెనెకా సంస్థ.

  Oxford-AstraZeneca Covid-19 Vaccine Trials Pause ప్రయోగాల దశలో సైడ్ ఎఫెక్ట్స్...!! | Oneindia Telugu

  ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

  మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్: ప్రజావసరాల కోసం అందుబాటులో: మాస్ వ్యాక్సినేషన్‌కు రెడీ

  ట్రయల్స్ నిలిపివేత..

  ట్రయల్స్ నిలిపివేత..

  కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌ను దీన్ని ప్రయోగించిన తరువాత దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తేలడంతో క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు తెలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన హెల్త్ వెబ్‌సైట్ స్టాట్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

  పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ..

  పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ..

  వ్యాక్సిన్‌ మూలకాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ వెల్లడించినట్లు తెలిపింది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్లపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతాయనేది ఇప్పట్లో బహిర్గతం కాకపోవచ్చని అంచనా వేసింది. ట్రయల్స్‌ను వెంటనే నిలిపివేయాల్సి వచ్చిందంటూ ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రయోగ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ఏజెడ్‌డీ 1222 (AZD1222)గా పిలుస్తున్నారు.

  భారత్ సహా అనేక దేశాల్లో ట్రయల్స్..

  భారత్ సహా అనేక దేశాల్లో ట్రయల్స్..

  ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాల దశలో ఉంది. రెండు, మూడో దశ ప్రయోగాలను చేపడుతున్నారు. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమౌతోంది. ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది.

  ట్రయల్స్ పునరుద్ధరణపై నో క్లారిటీ..

  ట్రయల్స్ పునరుద్ధరణపై నో క్లారిటీ..

  ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది విషయాన్ని కూడా ఆ సంస్థ ధృవీకరించలేదు. ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమౌతోంది.ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. ఇందులో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

  English summary
  AstraZeneca Plc has paused a late-stage trial of one of the leading Covid-19 vaccine candidates after a suspected serious adverse reaction in a study participant, health news website Stat News reported on Tuesday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X