వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పునరుద్దరణ... సేఫ్టీ క్లియరెన్స్ ఇచ్చిన రెగ్యులేటరీ

|
Google Oneindia TeluguNews

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ AZD1222 క్లినికల్ ట్రయల్స్‌ను తిరిగి పునరుద్దరించారు. ఇటీవలి ప్రయోగాల్లో బ్రిటన్‌కు చెందిన ఓ వలంటీర్ అనారోగ్యం బారినపడటంతో వ్యాక్సిన్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రయల్స్‌ను పునరుద్దరించినట్లు ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్‌లోని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(MHRA) వ్యాక్సిన్‌కు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపింది.

ఇటీవలి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఓ వలంటీర్‌కు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వగా అతను అనారోగ్యం బారినపడటంతో ట్రయల్స్‌ను నిలిపివేస్టున్నట్లు బుధవారం(సెప్టెంబర్ 9) ప్రకటించారు. అనంతరం వ్యాక్సిన్ సేఫ్టీపై ఓ స్వతంత్ర కమిటీని నియమించగా... బ్రిటన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ సేఫ్టీని ధ్రువీకరిస్తూ ఆ కమిటీ మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీకి సిఫారసు చేసింది. ఎంహెచ్ఆర్ఏ నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో ఎట్టకేలకు తిరిగి క్లినికల్ ట్రయల్స్ పునరుద్దరించబడ్డాయి.

AstraZeneca Resumes Oxford Coronavirus Vaccine Trial in UK after recent Pause

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ కోసం చివరి దశ ప్రయోగాల్లో ఉన్న 9 వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కూడా ఒకటి. బ్రిటన్‌లోనే కాకుండా ఇప్పటికే అమెరికాలోనూ క్లినికల్ ట్రయల్స్‌కు ఆస్ట్రాజెనెకా సిద్దమైంది. అక్కడ దాదాపు 30వేల మంది వలంటీర్లు ఇప్పటికే వ్యాక్సిన్ ప్రయోగాల కోసం స్వచ్చందంగా ముందుకొచ్చారు. అటు బ్రెజిల్,సౌత్ అమెరికాలోనూ ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

'అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టార్' టెక్నాలజీ ఆధారంగా జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్‌లతో దీన్ని అభివృద్ది చేశారు. ఈ వైరస్‌లను అడెనోవైరల్ వెక్టార్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించిందని అంతర్గత వ్యవస్థలను నమ్మింపజేయడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని కణాలు వాటి చుట్టూ స్పైక్ ప్రోటీన్లను ఏర్పరుచుకుంటాయి.

Recommended Video

Oxford-AstraZeneca Covid-19 Vaccine Trials Pause ప్రయోగాల దశలో సైడ్ ఎఫెక్ట్స్...!! | Oneindia Telugu

ఈ టీకాలో చింపాంజీ అడెనోవైరస్ బలహీనమైన మరియు జన్యుపరంగా మార్పు చెందిన రూపంలో ఉంటుంది కాబట్టి అది మనుషులకు సోకదు. కానీ స్పైక్ ప్రోటీన్ల ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఒక్కసారి ఈ వ్యాక్సిన్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే.. అది కరోనా వైరస్ లాంటి యాంటిజెన్స్(స్పైక్స్)ను వృద్ది చేస్తుంది. ఇవి అచ్చు కరోనా స్పైక్స్‌నే అనుకరిస్తాయి. మానవ శరీరం ఈ స్పైక్స్‌ను గుర్తించిన వెంటనే యాంటీబాడీస్(ప్రతినిరోధకాలు)ను విడుదల చేయడం మొదలుపెడుతుంది. ఈ యాంటీబాడీస్ ఆ స్పైక్స్‌పై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. అంతేకాదు, ఈ స్పైక్స్‌పై దాడి చేయడానికి రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను ఎప్పుడూ సిద్దంగా ఉంచుకుంటుంది.

English summary
Pharma giant AstraZeneca on Saturday said it had resumed a Covid-19 vaccine trial after getting the all-clear from British regulators, following a pause caused by a UK volunteer falling ill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X