ఇండోనేసియాలో ఆత్మాహుతి దాడి: 3 చర్చిల వద్ద 10మంది మృతి
జకర్తా: ఇండోనేసియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సురబయలోని మూడు చర్చిల వద్ద ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు పదిమంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లీం మెజార్టీ దేశం ఇండోనేసియా. ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం వేర్వేరు చోట్ల మూడు చర్చిల వద్ద ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని, పదిమంది చనిపోగా, చాలామంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ దాడి కారణంగా ఇద్దరు పోలీసులు సహా 41 మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శాంటా మారియా కాథలిక్ చర్చి, ఇండోనేసియా క్రిస్టియన్ చర్చ్, పెంథోకోస్ట్ చర్చిలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి.

శాంటామారియా కాథలిక్ చర్చి వద్ద జరిగిన దాడిలో నలుగురు, మృతి చెందగా, మిగిలిన రెండు చర్చిల వద్ద ఇద్దరు చొప్పున నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.












Click it and Unblock the Notifications