అమెరికాలో తేలిన భారతీయ వలసల లెక్క-వీరు స్వదేశానికి-మిగిలిన వాళ్లు జైల్లో..!
అమెరికా నుంచి ఇతర దేశాల అక్రమ వలసల తరహాలోనే భారతీయుల వలసల్ని కూడా ఏమాత్రం కనికరం లేకుండా బహిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టెక్సాస్ లో బయలుదేరిన 205 మంది భారతీయ వలసల సీ17 మిలటరీ విమానం ఇవాళ మధ్యాహ్నం భారత్ లో ల్యాండ్ అవుతోంది. అమృత్ సర్ లో ల్యాండ్ అయ్యాక వీరంతా ఎవరన్న దానిపై కేంద్రం వివరాలు బయటపెట్టబోతోంది. అయితే మొత్తం అమెరికా నుంచి ఇలా ఎంత మంది భారత్ కు రాబోతున్నారనేది ట్రంప్ సర్కార్ ఫైనల్ చేసింది.
తాజా లెక్కల ప్రకారం ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాకు అక్రమంగా వలస వచ్చి నివాసం ఉంటున్న భారతీయుల సంఖ్య 20407గా ట్రంప్ సర్కార్ తేల్చింది. వీరిలో 17,940 మందిని సరైన పత్రాలు లేని వారిగా నిర్ధారించారు. దీంతో వీరిని విడతల వారీగా బహిష్కరించడం మొదలుపెట్టేశారు. ఇందులో 205 మందినే టెక్సాస్ నుంచి సీ17 సైనిక విమానంలో భారత్ లోని అమృత్ సర్ కు ఇవాళ తరలిస్తున్నారు. వీరు కాకుండా మరో 2467 మంది అమెరికా జైళ్లలో మగ్గుతున్నట్లు తేలింది.

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై కొరడా ఝళిపిస్తున్న ట్రంప్ సర్కార్.. ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ పేరుతో వివిధ నగరాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తోంది. ఇందులో గుర్తించిన వారిని వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. అయితే ఇప్పటికే అక్రమ పత్రాలతో పట్టుబడిన వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టి జైళ్లకు కూడా పంపారు. ఇలా జైళ్లకు పంపిన భారతీయుల సంఖ్య 2467 అని ట్రంప్ సర్కార్ నిర్దారించింది. మిగిలిన 19470 మంది భారతీయుల్ని విడతల వారీగా స్వదేశానికి పంపేస్తున్నారు. వాస్తవానికి భారత ప్రధాని మోడీ ఈ నెలలో పర్యటించాల్సి ఉన్నా భారతీయుల తరలింపుల్లో ఏమాత్రం మినహాయింపు ఇచ్చే పరిస్ధితి కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications