వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన కార్గో విమానం: 41మంది మృతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

జుబా: ఓ కార్గో విమానం దక్షిణ సూడాన్‌ రాజధాని జుబాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 41మంది మృతిచెందినట్లు దక్షిణ సూడాన్‌ అధ్యక్ష అధికార ప్రతినిధి తెలిపారు. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది.

విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 20మంది ఉండగా.. వీరిలో ముగ్గురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. మిగిలినవారంతా విమానం కూలిన స్థలంలో ఉన్నవారిగా అధికారులు భావిస్తున్నారు. నైల్ రాష్ట్రానికి వెళ్తుండగా రన్‌వే దాటగానే విమానం కూలిందని తెలిపారు.

 At Least 41 People Killed in South Sudan Plane Crash

మాల్దీవుల్లో 30 రోజుల ఎమర్జెన్సీ

మాల్దీవుల్లో 30 రోజుల ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ జరగనున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ఎమర్జెన్సీ విధించినట్లు తెలుస్తోంది. నిరసనకారులను అరెస్టు చేయాలంటూ భద్రతాదళాలకు అధ్యక్షుడు పూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ వ్యతిరేకులు దేశాధ్యక్షుడిని చంపేందుకు కుట్ర పన్నినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత మహ్మద్ నషీద్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాద ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబర్ 28న జరిగిన దాడిలో యామీన్ భార్యతో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

English summary
Presidential spokesman Ateny Wek Ateny said the plane may have had about 20 people on board, including crew and 10 to 15 passengers, while an unknown number were killed on the ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X