రష్యా వైఖరిపై భద్రతా మండలిలో తీర్మానం : ఓటింగ్​కు దూరంగా భారత్​ -చైనా : వీటో చేస్తూ..!!

ఉక్రెయిన్ పైన రష్యా దాడి పైన అమెరికాతో పాటుగా యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే రష్యా పైన ఆర్దిక పరమైన ఆంక్షలు విధించాయి. పుతిన్ నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తప్పు బట్టారు. తాజాగా రష్యాతో పాటుగా పుతిన్ అదే విధంగా ఆ దేశ విదేశాంగా మంత్రి ఆస్తులను సైతం ప్రీజ్ చేస్తూ అమెరికా..బ్రిటన్.. యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పైన రష్యా దాడి అంశం పై ఐక్యరాజ్యసమతి భద్రతా మండలిలో చర్చ జరిగింది.

తీర్మానానికి దూరంగా భారత్

తీర్మానానికి దూరంగా భారత్

రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్​ దూరంగా ఉంది. ఈ ఓటింగ్​లో భారత్, చైనా పాల్గొనలేదు. మరోవైపు ఈ తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. తీర్మానాన్ని తిరస్కరించింది. ఇప్పటికే భారత ప్రతినిధి దీని పైన తమ విధానం స్పష్టం చేసారు. చర్చల ద్వారా విభేదాలు..వివాదాలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసారు. తాజాగా.. రష్యా వైఖరిని నిరసిస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు వచ్చాయి. భారత్, చైనా మరియు యుఎఇతో సహా మూడు దేశాలు గైర్హాజరయ్యాయి.

భారత్ కలత చెందుతోందంటూ

భారత్ కలత చెందుతోందంటూ


ఓటింగ్ సమయంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్పందించారు. ఇటీవల ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో భారతదేశం తీవ్రంగా కలత చెందుతోంది. హింస మరియు శత్రుత్వాలను తక్షణమే నిలిపివేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేయవలసిందిగా మేము కోరుతున్నామని స్పష్టం చేసారు. యూఎస్.. అల్బేనియా ఈ ముసాయిదా తీర్మానం సిద్దం చేసాయి. ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, జార్జియా, జర్మనీ, ఇటలీ, లీచ్‌టెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, న్యూజిలాండ్, నార్వే, పోలాండ్, సహా అనేక ఇతర దేశాలు ప్రతిపాదించగా.. యూకే..రుమేనియా మద్దతిచ్చాయి. 15 మంది సభ్యుల శక్తివంతమైన భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా, దాని వీటో అధికారాన్ని ఉపయోగించింది మరియు తీర్మానం ఊహించినట్లుగా విఫలమైంది.

రష్యా వీటో.. వీగిపోయిన తీర్మానం

రష్యా వీటో.. వీగిపోయిన తీర్మానం

అయితే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌పై దాడి మరియు చర్యల కోసం ప్రపంచ వేదికపై మాస్కో యొక్క ఒంటరితనాన్ని చూపించడానికి తీర్మానం ప్రయత్నిస్తుందని చెప్పారు. అయితే, న్యూ ఢిల్లీకి మాస్కోతో బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయనే తీర్మానంపై భారతదేశం ఎలా ఓటు వేస్తుందనే దానిపై అందరి దృష్టి ఉంది. కానీ, భారత్ ఓటింగ్ కు దూరంగా నిలచి తమ వైఖరి స్పష్టం చేసింది. ఇప్పటికే భారత ప్రధాని మోదీ నేరుగా పుతిన్ తో ప్రస్తుత పరిణామాల పైన చర్చించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దాడులు ఆపాల్సిందిగా సూచించినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+