Taiwan: తైవాన్‌లో భారీ అగ్నిప్రమాదం-46 మంది మృతి-1995 తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం

తైవాన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.కాహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల ఓ భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో తమకు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు కొందరు వెల్లడించారు.ప్రమాద కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.ప్రమాద సమయంలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.

atleast 46 killed in taiwan after fire broke out in an apartment

అగ్నిప్రమాద దృశ్యాలు పొరుగునే ఉన్న మరో బిల్డింగ్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాని ప్రకారం... మొదట ఆ భవనం మొదటి అంతస్తులోనే మంటలు చెలరేగాయి.ఆ తర్వాత క్షణాల్లోనే పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3గం. సమయంలో ఫైర్ సిబ్బందికి ప్రమాదంపై సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో మొత్తం 120 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 46 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మిగతావారి పరిస్థితేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో గతంలోనూ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 1999లో జరిగిన ఆ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ భవనం కొంతవరకు దెబ్బతిన్నది.అప్పటినుంచి ఆ భవనం శిథిలావస్థకు చేరుతూ వస్తోంది.ఈ భవనంలో కింద షాప్స్ ఉండగా.. పైన అపార్ట్‌మెంట్ ఉంది. అగ్ని ప్రమాదంలో భవనంలోని పలు అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

తైవాన్‌లో గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యంత భారీ అగ్నిప్రమాదంగా చెబుతున్నారు.1995లో తైచుంగ్ నగరంలో చోటు చేసుకున్న ఓ అగ్నిప్రమాదంలో 64 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇదే.ఘటనపై అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ 2019 నుంచి ఆ భవనాన్ని నాలుగుసార్లు తనిఖీ చేసినట్లు చెప్పారు.చివరిసారిగా గత మంగళవారమే భవనాన్ని తనిఖీ చేశామని.. అయితే కొన్ని కారణాల వల్ల పై అంతస్తుల్లో తనిఖీ సాధ్యపడలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని స్థానిక అధికారి ఒకరు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+