ఉద్యోగినితో ఉప ప్రధాని సెక్స్: స్టాఫ్‌తో మంత్రుల సెక్స్‌పై బ్యాన్

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఉద్యోగినితో ఉప ప్రధాని సెక్స్: స్టాఫ్‌తో మంత్రుల సెక్స్‌

  కాన్‌బెర్రా: ఓ ఉద్యోగినితో ఆస్ట్రేలియా ఉప ప్రధాని లైంగిక సంబంధం పెట్టుకోవడం వివాదంగా మారింది. అది ప్రభుత్వానికి తలనొప్పిగా కూడా మారింది. దాంతో మంత్రులకు ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ప్రవర్తనా నియమావళిని జారీ చేశారు.

  మంత్రులు ఎవరు కూడా తమ సిబ్బందితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఆస్ట్రేలియా ఉప ప్రధాని బార్నబీ జాయిస్ (50) తన మాజీ మీడియా సలహాదారు విక్కీ కాంపియన్ (33)తో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.

  Australian PM bans ministers from having sex with staff

  జాయిస్ కారణంగా విక్కీ గర్భం దాల్చినట్లుగా ఓ మ్యాగజైన్ గతవారం వెలుగులోకి తెచ్చింద. ఆయనే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరించారు. దాంతో జాయిస్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది.

  వివాహితులైనా, అవివాహితులైనా... ఎవరు కూడా మంత్రులు సిబ్బందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని, అలా చేస్తే అది ప్రమాణాలను ఉల్లంఘించినట్లేనని టర్న్‌బుల్ జర్నలిస్టులతో అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Australia is banning sexual relations between government ministers and their staff following a scandal involving the deputy prime minister and his press officer.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి