• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్‌మాన్ అల్ జవహిరి: అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అయ్‌మాన్ అల్ జవహిరి

అఫ్గానిస్తాన్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్-జవహిరి హతమయినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.

ఆదివారం అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా (సీఐఏ) చేపట్టిన ఆపరేషన్‌లో ఆయన మరణించారు.

అల్ జవహరి "అమెరికా పౌరులపై హింస, హత్యలకు మార్గం వేశారని" జో బైడెన్ అన్నారు.

"ఇప్పుడు న్యాయం జరిగింది. ఈ తీవ్రవాద నాయకుడు ఇక లేరు" అని ఆయన అన్నారు.

అల్ జవహరి ఒక సురక్షిత ప్రాంతంలోని ఇంట్లో ఉన్నారని, అమెరికా డ్రోన్ దాడి చేసినప్పుడు ఆయన ఆ ఇంటి బాల్కనీలో తిరుగుతున్నారని అధికారులు తెలిపారు.

మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు కానీ, వారికి ఏమీ కాలేదని, అల్ జవహరిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు.

71 ఏళ్ల అల్-ఖైదా నాయకుడిపై "కచ్చితమైన గురి పెట్టడానికి" తాను తుది ఆమోదం తెలిపినట్లు బైడెన్ చెప్పారు.

2011లో ఒసామా బిన్ లాడెన్ మరణించిన తరువాత అయ్‌మాన్ అల్ జవహరి అల్ ఖైదా నాయకత్వాన్ని అందుకున్నారు. అల్ జవహరి, లాడెన్ కలిసి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు పథకం రచించారు. అమెరికా "మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో" అల్ జవహరి ఒకరు.

అల్ జవహరి మరణం 2001 దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగిస్తుందని బైడెన్ అన్నారు.

అయ్‌మాన్ అల్ జవహిరి

2000 అక్టోబర్‌లో అడెన్‌లోని యూఎస్ఎస్ కోల్ నావికా దళంపై ఆత్మాహుతి బాంబు దాడి సహా పలు దాడుల వెనుక ప్రధాన హస్తం అల్ జవహరిదేనని బైడెన్ చెప్పారు. యూఎస్ఎస్ కోల్‌పై బాంబు దాడిలో 17 మంది అమెరికా నావికులు చనిపోయారు.

"ఎంత సమయం పట్టినా, మీరు ఎక్కడ ఏ మూల దాక్కున్నా, మీ వల్ల మా పౌరులకు ముప్పు అని భావిస్తే, అమెరికా మిమ్మల్ని కచ్చితంగా పట్టుకుంటుంది, చంపేస్తుంది. మా దేశాన్ని, మా పౌరులను రక్షించడంలో మేమెప్పుడూ వెనుకాడం" అని బైడెన్ అన్నారు.

అయితే, అమెరికా చేసిన డ్రోన్ దాడి అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందని తాలిబాన్ ప్రతినిధి ఒకరు అన్నారు.

"ఇలాంటి చర్యలు గత 20 ఏళ్లుగా విఫలమవుతూనే న్నాయి. ఇవి అమెరికా, అఫ్గానిస్తాన్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజాలకు విరుద్ధం" అని ఆయన అన్నారు.

అయితే, ఈ ఆపరేషన్‌కు చట్టపరమైన సమ్మతం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగిన ఏడాది తరువాత ఆ దేశం అల్ జవహరిపై దాడి నిర్వహించింది.

2020లో తాలిబాన్లు, అమెరికాతో చేసుకున్న శాంతి ఒప్పందంలో, తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో అల్ ఖైదా లేదా మరే ఇతర తీవ్రవాద సంస్థలను అనుమతించమని అంగీకరించారు.

అయితే, తాలిబాన్, అల్ ఖైదా చిరకాలంగా సన్నిహితులని, కాబూల్‌లో అల్ జవహరి ఉన్నట్టు తాలిబాన్లకు తెలిసునని అమెరికా అధికారులు అంటున్నారు.

అఫ్గానిస్తాన్ ఇంకెప్పటికీ తీవ్రవాదులకు ఆశ్రయం కాకూడదని బైడెన్ అన్నారు.

ఈజిప్షుకు చెందిన అల్ జవహరి ఒక కంటి డాక్టర్. ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్‌ను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2011లో లాడెన్ మరణం తరువాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టారు.

అంతకు ముందు అల్ జవహరి ఒసామా బిన్ లాడెన్ కుడి భుజంగా వ్యవహరించేవారు. అల్ ఖైదాలోని ముఖ్య సిద్ధాంతకర్త కూడా.

అమెరికా 9/11 దాడుల్లో ప్రముఖ హస్తం అల్ జవహరిదేనని నిపుణులు భావిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ayman al-Zawahiri: Al Qaeda leader killed in US drone strike
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X