కాలినడకన అయినా సరే - ఖార్కివ్‌ను వదిలి రండి : రష్యా సమాచారంతోనే- విదేశాంగ శాఖ..!!

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమాన్ని కేంద్రం వేగవంతం చేసింది. ఉక్రెయిన్ లో పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న భారతీయులను అప్రమత్తం చేస్తోంది. అందులో భాగంగా.. ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా సేనల భీకరదాడులు కొనసాగుతున్న వేళ అక్కడి భారత రాయబార కార్యాలయం భారత పౌరుల భద్రత దృష్ట్యా అత్యవసర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఖార్కివ్‌ నగరాన్ని తక్షణమే వీడాలని సూచించింది. పెసోచిన్‌, బాబే, బెజ్లియుడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోవాలని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది.

తాజాగా, మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ ఉక్రెయిన్​ నుంచి భారతీయలు తరలింపుపై విదేశాంగశాఖ అడ్వయిజరీ జారీ చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రష్యన్ సలహా మేరకు ఖార్కివ్‌ను భారతీయులు ఖాళీ చేయాలని పేర్కొంది. కాలినడకన అయినా సరే ఖార్కివ్‌ను వదిలి బయటకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. రష్యన్ ఇన్‌పుట్‌పైనే ఖార్కివ్ నుంచి బయటకు రావాలని అడ్వయిజరీలో వివరించింది.ఇప్పటి వరకు 17,000 మంది భారతీయులు ఉక్రెయిన్‌ నుంచి బయటికి వచ్చినట్లు విదేశాంగశాఖ చెప్పింది.

Bagchi said, The advisory issued by our Embassy to leave Kharkhiv is based on our information from Russia

మొత్తం 15 విమానాల్లో 3,353 మంది భారతీయులు దేశానికి తిరిగి వచ్చినట్లు పేర్కొంది. 24 గంటల్లో మరో 15 విమానాలు ద్వారా తరలింపును చేపట్టనున్నట్లు, ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు వివరించింది. పాసుపోర్టు సమస్య ఉన్న వారికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేసే ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తొలిగిస్తామని కేంద్రం అధికారులు స్పష్టం చేసారు. వారికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేస్తామని వెల్లడించారు. ఇది పాస్ పోర్టులు ప్రస్తుత పరిస్థితుల్లొ పోగొట్టుకున్నవారికి మేలు చేస్తుందన్నారు.

ఇక.. రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇప్పటి వరకు 2,000 మంది పౌరులు చనిపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్​ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఐరాస కీలక ప్రకటన విడుదల చేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి భారీగా వలసలు పెరిగినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 8.36 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి వెల్లినట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+