US elections: ఎన్నికల వేళ అమెరికాలో ఉద్రిక్తత.. అగ్రరాజ్యంలోనూ తప్పని హింస

Election Violence: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్. అమెరికాలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. పేరుకి అగ్రరాజ్యమైనా కూడా ఎన్నికల వేళ విధ్వంసం చోటుచేసుకుంది. ఇది చూసి అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం గురించి ప్రముఖంగా వినిపిస్తోంది.

అమెరికాలోని వాషింగ్టన్ మరియు ఒరెగాన్ రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఉద్రిక్తత ఏర్పడింది. రెండు బ్యాలెట్ డ్రాప్ బాక్సులు అగ్నికి ఆహుతయ్యాయి. వందల సంఖ్యలో బ్యాలెట్లు ఈ ఘటనలో దహనమైపోయినట్లు ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. 'అన్ని డ్రాప్ బాక్సులు దహనం చేస్తాం. గాజాకు స్వేచ్ఛ ఇవ్వాలి' అని రాసివున్న నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ విధ్వంసానికి ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులు కారణం కావొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Ballot boxes burnt in US elections

పేలుడు పదార్థాల ద్వారా వాంకూవర్, పోర్ట్‌ల్యాండ్‌లో ఈ అగ్నిప్రమాదాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోర్ట్‌ల్యాండ్‌లో ఫైర్ సప్రెషన్ సిస్టమ్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ ఫిషర్ ల్యాండింగ్ సెంటర్ వద్ద మాత్రం బ్యాలెట్లు కాలిపోయాయి. ఈ నెల ప్రారంభంలో కూడా వాంకూవర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. తాజా సంఘటనకు దానితో సంబంధం ఉందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) పేర్కొంది.

ఈ రెండు సంఘటనలకు ఒకే వ్యక్తి కారణం కావచ్చని పోర్ట్‌ల్యాండ్ పోలీస్ బ్యూరో ప్రతినిధి మైక్ బెన్నర్ అనుమానం వ్యక్తం చేశారు. తమ చెకింగ్స్‌లో నిందితుడి ఉపయోగించిన వాహనాన్ని గుర్తించారు. ఎవరి ఓట్లు కాలిపోయాయో వారిని గుర్తించి మరొక బ్యాలెట్ పంపించాలని మల్టనోమా కౌంటీ ఎన్నికల విభాగం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్స్ సమీపంలో ఏదైనా అనుమానాస్పద చర్యను గమనిస్తే వెంటనే 911కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+