బ్యాంకాక్‌లో బాంబు పేలుడు: 15మంది మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ ప్రార్థనా మందిరం సమీపంలో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిహేను మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
దాదాపు ఎనభై మంది వరకు గాయపడ్డారని తెలుస్తోంది. సోమవారం సెంట్రల్ బ్యాంకాక్‌లోని కమర్షియల్ హబ్‌లో పేలుడు సంభవించింది. బాంబు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని థాయ్‌లాండ్ నేషనల్ పోలీస్ చీఫ్ ధ్రువీకరించారు.

స్కూటర్‌లో దాచిన బాంబు పేలినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో భారతీయులకు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం లేదని థాయ్‌లాండులోని దౌత్యాధికారి చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈరావన్ ప్రార్థనా మందిరం సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఇక్కడ బ్రహ్మ దేవుడు కొలువై ఉన్నారు. ఇది బాంబు పేలుడేనని, అయితే, ఏ తరహా బాంబో గుర్తించవలసి ఉందని నేషనల్ పోలీసు అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications