విమానంలో మంటలు: 14మందికి గాయాలు
బీజింగ్: చైనా నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు వెళుతున్న చైనీస్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో చైనాలోని సాన్యా నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా దిగింది.
త్వరగా విమానం నుంచి బయటపడాలన్న ఆత్రుతతో ప్రయాణికులు హడావుడిగా బయటకు పరుగులు పెట్టడంతో 14 మందికి స్వల్పంగా గాయపడ్డారు. విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగినట్లు గుర్తించడంతో పైలట్ అత్యవసరంగా దింపినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

విమానం(3081)లోని 132 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్టు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌పోర్టు వైద్య కేంద్రంలో చికిత్స అందించారు.
కాగా, ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికులను వారి వారి గమ్యాలకు చేరవేసేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు విమానయాన అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications