వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. నౌకలో మంటలు.. 32 మంది సజీవదహనం

|
Google Oneindia TeluguNews

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఫెర్రి నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో 32 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మందికి తీవ్ర‌గాయాలైన‌ట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

అగ్ని ప్ర‌మాదం.. 32 మంది స‌జీవ‌ద‌హ‌నం

అగ్ని ప్ర‌మాదం.. 32 మంది స‌జీవ‌ద‌హ‌నం


ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న మూడంతస్తుల ఫెర్రీ నౌకలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నికీలలు ఒక్కసారిగా ఎగిసి పడుతుండడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. మంటల్లో చిక్కుకున్న 32 మంది సజీవదహనమయ్యారు. 100 మందికి తీవ్రగాయాలయ్యాయి.

 ఫెర్రీలో 500 మంది ప్ర‌యాణికులు

ఫెర్రీలో 500 మంది ప్ర‌యాణికులు

ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీ నౌకలో 500 ప్రయాణికులు ఉన్నారని లోకల్ పోలీసు చీఫ్ మెయినల్ ఇస్లాం తెలిపారు. మంటల్లో చిక్కుకుని కొంతమంది మృతి చెందగా.. మరికొందరు నదిలో దూకేసి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పేరిగే అవకాశం ఉందన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇంజన్లో మంటలు సంభవించడమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు.

 బంగ్లాదేశ్‌లో త‌ర‌చూ ప‌డ‌వ ప్ర‌మాదాలు

బంగ్లాదేశ్‌లో త‌ర‌చూ ప‌డ‌వ ప్ర‌మాదాలు

బంగ్లాదేశ్‌లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 2015లో కార్గో నౌకను ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఢీకొనడంతో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డాకాలో ఒక ఫెర్రీని మరొక ఫెర్రీని వెనుక నుంచి ఢీకొనడంతో పడవ బొల్తా పడి 32 మంది చనిపోయారు.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రెండు వేర్వేరు ప్రమాదాలు సంభవించి 54 మంది మరణించారు. బిజోయ్‌న‌గ‌ర్‌కు సమీపంలో కార్గో షిప్ స్టీల్ బోటు, ఎదురుగా వచ్చే ఓడను ఢీకొట్టడంతో పడవలో ఉన్న 60 మంది మరణించారు. ఆగస్ట్‌లో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న పడవను, ఇసుకతో నిండిన కార్గో షిప్ ఢీకొనడంతో 21 మంది మృతి చెందారు.

English summary
Bangladesh ferry Ship fire Incident, 32 members Dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X