బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత- వెంటిలేటర్ పై ఉంటూ ఎన్నికల్లో పోటీకి సై

Khaleda Zia: బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్లు ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ ఫలితం రాలేదు. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

లివర్ సిరోసిస్, కీళ్ల నొప్పులు, మధుమేహం, అలాగే ఛాతీ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో నవంబర్ 23వ తేదీన ఎవర్ కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వృద్ధాప్య సంబంధిత ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మరింత విషమిస్తూ వచ్చింది. దీంతో ఈ నెల 11వ తేదీన వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. కొద్దిసేపటి కిందటే ఆమె కన్నుమూశారు.

Bangladesh s first female PM Khaleda Zia dies at 80 after lengthy illness

ఖలీదా జియా తుదిశ్వాస విడిచే సమయంలో ఆమె పెద్ద కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహమాన్, కోడలు డాక్టర్ జుబైదా రెహమాన్, మనవరాలు జైమా రెహమాన్, చిన్న కోడలు షర్మిలి రెహమాన్ సితి, తమ్ముడు షమీమ్ ఎస్కందర్, ఆయన భార్య, అక్కా సెలీనా ఇస్లాం, బీఎన్‌పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగుర్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె ఆరోగ్య చికిత్సను పర్యవేక్షించిన వైద్య బృందం సభ్యులు కూడా అక్కడే ఉన్నారు.

సోమవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యం వేగంగా క్షీణించిందని బీఎన్‌పీ ప్రకటించింది. మెరుగైన చికిత్స కోసం లండన్‌కు తరలించాలని భావించారు. దీనికోసం ఖతార్ నుండి ప్రత్యేక విమానం సైతం సిద్ధం చేశారు. దీనికి మెడికల్ బోర్డు అనుమతి నిరాకరించింది. ఎయిర్ లిఫ్ట్ కు ఆమె శరీరం సహకరించట్లేదని తెలిపింది.

ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఖలీదా జియా తరఫున నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఆమె మరణానికి ఒక రోజు ముందు.. బోగురా-7 నియోజకవర్గం నుంచి ఖలీదా జియా తరపున బీఎన్పీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ సీనియర్ నాయకులు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పత్రాలు సమర్పించారు. ఆసుపత్రిలో, వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిసినా, బీఎన్‌పీ ఆమెను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించింది.

మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సతీమణి అయిన ఖలీదా జియా.. బంగ్లాదేశ్ కు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆ దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా అత్యంత ప్రముఖ, వివాదాస్పద వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. బీఎన్‌పీ అధ్యక్షురాలిగా, మాజీ ప్రధానిగా, ఆమె దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారత్ తో సత్సంబంధాలను కొనసాగించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ ను సందర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+