1000 కిలోల మామిడి పండ్లతో మోదీని బుట్టలో పడేసిన బంగ్లాదేశ్.. పాక్, చైనాలకు షాక్..
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు ఉండటం చాలా ముఖ్యం. అయితే భారత్ కు ఇటు పాకిస్థాన్, అటు చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ కు మరో సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్.. భారత్ తో సత్సంబంధాలు పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ప్రధాని మోదీకి గుడ్ విల్ కింద 1000 కిలోల మామిడి పండ్లను బహుమతిగా పంపించింది.
భారత్- బంగ్లాదేశ్ మధ్య బంధాన్ని మరింత దృఢంగా మలిచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి భారీ బహుమతి అందజేసింది. గుడ్ విల్ కింద ప్రధానికి 1000 కిలోల అరుదైన మామిడి పండ్లను గిఫ్ట్ గా పంపింది. ఈ రకం మామిడి పండ్లను హరిభంగా మామిడి అని స్థానికంగా పిలుస్తారు. మ్యాంగో డిప్లోమసీ కింద ఈ పండ్లను ధాకా నుంచి దిల్లీ చేరుకున్నాయి.
అయితే కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్ వ్యవహారంపై మాట్లాడిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. బంగ్లాదేశ్ తో భారత్ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగించాలని కోరుకుంటోందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని మోదీకి మామిడి పండ్లను అందజేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు ధాకా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఓ వైపు రాజకీయ సంక్షోభం, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల కొరతతో పాటు హింస, దాడులతో ఆ దేశం అట్టుడుకిపోతోంది. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వానికి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలో భారత్ లాంటి సరిహద్దు దేశం మద్దతు బంగ్లాకు ఎంతో అవసరం. ఈ క్రమంలోనే భారత్ కు 1000 కిలోల మామిడిని సరఫరా చేసింది ధాకా.
#Gravitas | Bangladesh's 'mango diplomacy' with India.
— WION (@WIONews) July 14, 2025
Muhammad Yunus sends 1,000 KG Haribhanga mangoes to PM Modi.@SehgalRahesha decodes. pic.twitter.com/TeRrqpuzvC
ప్రధాని మోదీతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, త్రిపుర సీఎం మానిక్ సాహాలకు కూడా గుడ్ విల్ లో భాగంగా మామిడి పండ్లను పంపించింది బంగ్లాదేశ్. సరిహద్దు రాష్ట్రాలతోనూ సత్సంబంధాలను కొనసాగించాలని యూనస్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల ఏప్రిల్ లో జరిగి బిమ్ స్టెక్ సమావేశంలో ప్రధాని మోదీతో మహమ్మద్ యూనస్ సమావేశం అయ్యారు. ఆ సమయంలో బంగ్లాలో శాంతి నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రాలు ఐదు ఉన్నయి. అవి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications