Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుణ్య‌కాలం కాస్తా అప్పీళ్ల‌తోనే గ‌డిచిపోతుందా? మ‌రిన్ని ఆస్తుల వేలానికి ఈడీ ఓకే మ‌రోసారి అప్పీల్ చేస

లండ‌న్ః దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేర‌స్తుడు విజ‌య్ మాల్యా ఇప్ప‌ట్లో స్వ‌దేశానికి తిరిగి రావ‌డం అయ్యే ప‌నిలా క‌నిపించ‌ట్లేదు. చ‌ట్టంలో ఉన్న సౌల‌భ్యాలే దీనికి కార‌ణం. అప్పీల్‌కు వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణయించుకోవ‌డ‌మే దీనికి కార‌ణం. ప్ర‌స్తుతం లండ‌న్ శివార్ల‌లోని త‌న సొంత ఫామ్‌హౌస్‌లో నివ‌సిస్తున్నారు మాల్యా. ఆయ‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ‌డానికి త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని యుకే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

దీనికి అనుగుణంగా ఆ దేశ హోమ్ శాఖ మంత్రి సాజిద్ జావేద్ ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వులు అమ‌లు కావ‌టం క‌ష్టమే. దీనిపై తాను న్యాయ‌స్థానంలో అప్పీల్ చేస్తాన‌ని విజ‌య్ మాల్యా ప్ర‌క‌టించారు. తాను స్వ‌దేశానికి వెళ్లాలా? వ‌ద్దా? అనే విష‌యాన్ని ఆయ‌న న్యాయ‌స్థానంలో అప్పీల్ చేసుకోవ‌చ్చ‌ని ఈ ఉత్త‌ర్వుల్లో మెలిక పెట్టారు.

Banks can sell Mallyas assets: Enforcement Directorate gave NOC

ఆ ట్విస్ట్‌ను ప‌ట్టుకున్నారు మాల్యా. తాను న్యాయ‌స్థానంలో అప్పీల్ చేసుకుంటాన‌ని వెల్ల‌డించారు. బ్యాంకుల‌కు 9,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా కుచ్చుటోపీ పెట్టిన ఈ లిక్క‌ర్ బ‌రూన్‌.. 2016లో దేశం విడిచి పారిపోయారు. లండ‌న్‌కు వెళ్లి, అక్క‌డే నివ‌సిస్తున్నారు. మూడేళ్ల త‌రువాత కూడా ఆయ‌నను స్వ‌దేశానికి ర‌ప్పించ‌లేక‌పోతోంది కేంద్ర ప్ర‌భుత్వం.

మాల్యా ఎక్క‌డున్నారో తెలిసిన‌ప్ప‌టికీ.. సాంకేతిక‌ప‌ర‌మైన కొన్ని కార‌ణాల వ‌ల్లే ఆయ‌న‌ను వీలైనంత వేగంగా ర‌ప్పించ‌లేక‌పోతున్నామ‌ని చెబుతోంది కేంద్రం. తాజాగా- యూకే హోమ్ మంత్రి జారీ చేసిన ఆదేశాల్లో ఉన్న వెస‌లుబాటును త‌న‌కు అనుకూలంగా మార్చుకుని, న్యాయ‌స్థానంలో అప్పీల్‌కు వెళ్తే.. ఇక ఆ కేసు ఇప్ప‌ట్లో తేల‌దు. అలా, అలా మ‌రో ఏడాదో, రెండేళ్లో అల‌వోక‌గా గ‌డిపేస్తారు. ఈ లోగా పుణ్యకాలం కాస్త గ‌డిచిపోతుంది.

ఆయ‌న చేసే అప్పీల్‌కు వ్య‌తిరేకంగా ఆ దేశ హైకోర్టులో తీర్పు వెలువ‌డితే.. సుప్రీంకోర్టు ఉండ‌నే ఉంది. అక్క‌డికీ వెళ్లే అవ‌కాశం ఉన్నందున‌.. మాల్యా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దాన్ని వ‌దులుకోరు. అప్పీళ్ల మీద అప్పీళ్ల‌తో కాలం గ‌డిపేస్తారు. మాల్యా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని, నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్నారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయి.

ఈ విష‌యాన్ని మ‌న‌దేశం యూకే ప్ర‌భుత్వానికి నివేదించింది. మాల్యాను భార‌త్‌కు అప్పగించే విష‌యాన్ని పరిశీలించాలని కోరుతూ వెస్ట్ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ గత ఏడాది డిసెంబరు 10న యూకే ప్ర‌భుత్వానికి సూచిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వెస్ట్ మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చిన వెంట‌నే మాల్యా అప్పీల్‌కు వెళ్ల‌లేదు. యూకే ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యం కోసం వేచి చూశారు. త‌న అప్ప‌గింత‌పై ఆ దేశం సానుకూలంగా స్పందించ‌డంతో మాల్యా రంగంలోకి దిగారు. అప్పీల్‌కు వెళ్ల‌బోతున్నారు. చ‌ట్టంలో ఉన్న వెస‌లుబాటును త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు ఆ ఆర్థిక నేర‌స్తుడు.

మాల్యా దేశం విడిచి పారిపోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న స‌రిహ‌ద్దులు దాటిన త‌రువాత‌.. చేసేదేమీ లేక బ్యాంక‌ర్లు త‌ల ప‌ట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ- స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఇత‌ర బ్యాంకులు మాల్యా ఆస్తుల‌ను వేలం వేశారు. గోవాలో మాల్యాకు ఉన్న అతి ఖ‌రీదైన గెస్ట్ హౌస్ స‌హా కొన్ని స్థిరాస్తుల‌ను జ‌ప్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. 9000 కోట్ల రూపాయ‌లు బ్యాక‌ర్ల‌కు స‌మ‌కూర‌లేదు. ఆయ‌న ఎక్క‌డ ఉన్నారో తెలిస‌న‌ప్ప‌టికీ.. వెంట‌నే స్వ‌దేశానికి ర‌ప్పించ‌డానికి కేంద్రం కూడా పెద్ద‌గా శ్ర‌ద్ధ చూప‌లేదు. దీనికి ప‌లు సాంకేతిక కార‌ణాలు అడ్డొచ్చాయ‌ని చెబుతూ, ఈ విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు దాట‌వేస్తూ వ‌చ్చాయి.

ఇదిలావుండ‌గా.. మాల్యాకు చెందిన మ‌రికొన్ని ఆస్తుల‌ను వేలం వేయ‌డానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ నిర‌భ్యంర ప‌త్రాన్ని ఇచ్చింది. కొన్ని స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. అవి.. ప్ర‌స్తుతం ఈడీ ప‌రిధిలో ఉన్నాయి. తాము కోల్పోయిన మొత్తాన్ని రాబ‌ట్టుకోవ‌డానికి ఈడీ ప‌రిధిలో ఉన్న ఆస్తుల‌ను కూడా వేలం వేయ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని స్టేట్ బ్యాంక్ ఇండియా నేతృత్వంలోని బ్యాంక‌ర్ల క‌న్సార్టియం న్యాయ‌స్థానానికి విజ్ఞ‌ప్తి చేసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఈడీ.. త‌మ ప‌రిధిలో ఉన్న మాల్యా ఆస్తుల‌ను వేలం వేసుకోవ‌చ్చ‌ని అంటూ ఎన్ఓసీని మంజూరు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+