వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22 మంది మృతి: క్షమించమని అడిగిన ఒబామా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్‌లోని ఓ మెడికల్ క్లినిక్‌పై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా క్షమాపణలు తెలిపారు. ఆప్గనిస్థాన్‌లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' అంతర్జాతీయ సంస్థ ప్రెసిడెంట్ జొయెన్నె లియుతో బరాక్ ఒబామా ఫోన్‌లో మాట్లాడారు.

పొరపాటున ఈ దాడి జరిగిందని, అందుకు క్షమించాలని ఒబామా కోరినట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జోష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని, మిలటరీ చర్యలను పర్యవేక్షిస్తామని చెప్పారు.

ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా పొరపాటున ఓ మెడికల్ క్లినిక్‌పై అమెరికా వైమానిక దళాలు దాడి చేశాయి. శనివారం జరిగిన ఈ వైమానిక దాడుల్లో కుందుజ్‌లో ఉన్న ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది ఆప్గన్ పౌరులు చనిపోయారు.

Barack Obama apologizes for US attack on Afghan hospital

తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆప్గన్‌‌లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్ బెల్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఆప్గన్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్ బెల్ చెప్పారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుందుజ్‌లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్‌లో భాగంగా ఆప్గన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్ బెల్ చెప్పారు.

English summary
President Barack Obama has apologized to Doctors Without Borders for the US air attack that hit the group's medical clinic in Afghanistan. Obama spoke to the group's international president, Joanne Liu, on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X