వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో మోడీ హవా: తొలిస్థానంలో ఒబామా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రముఖులైన ప్రపంచ నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరిగా నిలిచారు. బర్సన్-మార్స్‌టెల్లర్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీకి 3.1 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే అధికారిక ప్రధాని కార్యాలయం పేజీకి 1.01 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా ప్రపంచంలో అందరికంటే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. బరాక్ ఒబామా క్యాంపైన్ పేజీలో 4.6 కోట్ల లైక్‌లున్నాయి.

Barack Obama and Narendra Modi Most Liked on Facebook

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్‌లో ఒబామా తర్వాత రెండో స్థానంలో ప్రధాని మోడీనే ఉన్నారు. అయితే ఫేస్‌బుక్ పేజీలో పరస్పరం అభిప్రాయాలు పంచుకునే (ఇంటరాక్షన్) విషయంలో (పోస్ట్ లైక్‌లు, వ్యాఖ్యలు, షేర్ చేసుకోవడం) అమెరికా అధ్యక్షుడు ఒబామా కన్నా ప్రధాని మోడీ ముందంజలో ఉన్నారు.

2015 సంవత్సరానికి గాను ప్రధాని మోడీ ఫేస్‌బుక్ 'కమ్యూనిటీ' లో 20 కోట్లకు పైగా ఇంటరాక్షన్లు నమోదయ్యాయి. ఒబామాకు నమోదైన వాటికన్నా ఇవి ఐదింతలు ఎక్కువ. మొత్తంగా ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోని ర్యాంకింగుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశీ వ్యవహారాలు శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు భారతీయ నేతలు ముందంజలో ఉన్నారు.

English summary
Almost 90 percent of all governments have an official Facebook presence, and 87 heads of state, 82 heads of government and 51 foreign ministers maintain personal pages on the platform, according to a new study by Burson-Marsteller, a leading global public relations and communications firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X