వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కారు ప్రమాదం: గణిత మేధావి 'ఎ బ్యూటీఫుల్ మైండ్' నాష్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ట్రెంటన్: గణిత శాస్త్ర మేధావి, నోబెల్ బహుమతి గ్రహీత జాన్ నాష్ జూనియర్ (86), ఆయన భార్య అలీషియా నాష్ (82)లు ఓ కారు ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని న్యూజెర్సీ టర్న్ పైక్‌లో ఈ దుర్ఘటన జరిగింది.

నోబెల్‌ బహుమతి పొందిన గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ ‘ఎ బ్యూటిఫుల్‌ మైండ్' చలన చిత్రానికి ప్రేరణ. ఆదివారం న్యూయార్క్‌ పోలీసులు చేసిన ఒక ప్రకటనలో నాష్‌తో పాటు ఆయన భార్య కూడా మరణించారని తెలిపారు.

'Beautiful Mind' mathematician John Nash, wife killed in car crash

నాష్, భార్య అలీసియాతో కలిసి శనివారం కారులో ప్రయాణిస్తుండగా ముందు వెళ్తున్న కారును డ్రైవర్‌ ఓవర్ టేక్‌ చేయబోయాడు. అదుపు తప్పి రోడ్డు పక్క రైలింగ్‌ను కారు ఢీకొనగా నాష్‌ దంపతులు మరణించారు. గాయపడిన టాక్సీ డ్రైవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

86 ఏళ్ల వయసులోనూ ఈ నెల్లోనే మరో గణిత శాస్త్రవేత్త లూయిస్‌ నిరెన్‌ బర్గ్‌తో కలిసి నాష్‌ నార్వేకు చెందిన ప్రతిష్ఠాత్మక బహుమతి అబెల్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ‘గేమ్‌ థియరీ-ది స్టడీ ఆఫ్‌ డెసిషన్‌ మేకింగ్' సిద్ధాంతానికి 1994లో ఆయనకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి లభించింది.

English summary
John Forbes Nash Jr., the Princeton University mathematician whose life inspired the film "A Beautiful Mind," and his wife died in a car crash Saturday, according to New Jersey State Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X