భూకంపాలు... ఆరువేల కిలోమీటర్లు మార్చగలవు
వాషింగ్టన్: భూకంపాలు భూపటాలం స్థితి స్థాపక లక్షణాలను ఆరువేల కిలోమీటర్ల దాకా మార్చి వేయగలవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొద్ది వారాల పాటు ఒత్తిడులను తట్టుకునే సామర్థ్యాన్నీ మారుస్తాయని గుర్తించింది.
భూమి గతిశీలమని, అంతర అనుసంధాన వ్యవస్థ కలిగి ఉంటుందని, ఒక భారీ భూకంపం వేల కిలోమీటర్ల పాటు ఒకదాని వెంట ఒకటిగా పర్యావసన క్రమ ఘటనలను సృష్టిస్తుందని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012లో ఉత్తర సమత్రా తీరంలో వచ్చిన భూకంపాన్ని అధ్యయనం చేశారు.

ఒక భూకంపం నుంచి ఉపరితల తరంగం మరో బలహీన ప్రాంతానికి పాకినప్పుడు సంఘర్షణాయుతమైన లక్షణాల మధ్య సమతౌల్యంలో మార్పులు తీసుకు రావడం వల్ల ఉపరితలం ఒకటిగా ఉండేలా చేస్తుందని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications