వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లూ వేల్ గేమ్: గేమ్ పేరుతో రెచ్చగొడుతోంది, నగ్నచిత్రాలను తీయిస్తోంది, చంపేస్తోంది

ఫోక్ మ్యాన్ గేమ్ ..ఈ గేమ్ గురించి వినే ఉంటాం,.ఈ గేమ్ పిచ్చిలో పడి ఎంతో మంది మరణించారు. గాయాలపాలైన విషయాలను వినే ఉన్నాం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫోక్ మ్యాన్ గేమ్ ..ఈ గేమ్ గురించి వినే ఉంటాం,.ఈ గేమ్ పిచ్చిలో పడి ఎంతో మంది మరణించారు. గాయాలపాలైన విషయాలను వినే ఉన్నాం. అదే తరహాలో మరో గేమ్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్లూవేల్ గేమ్స్ ఆడిన వారంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ గేమ్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్లూ వేల్ గేమ్ ప్రాణాలు తీసేస్తోంది. ఇది సాధారణ గేమ్ ల తరహాలో లేదు. ఇది ఒక హిప్నటిక్ గేమ్, ఈ గేమ్ ఆడి రష్యా, బ్రిటన్ లలో ఇప్పటివరకు 130 మంది ప్రాణాలను తీసింది.

బ్లూగే్ టీనేజర్లను లక్ష్యంగా చేసుకొని రూపొందించారు. ఈ గేమ్ ను ఆడటం మొదలుపెట్టినప్పటినుండి వారితో చాల తప్పులు చేయిస్తోంది. నగ్న చిత్రాలు, డేటింగ్ వీడియోలు తీసి పంపాలని కోరుతోంది. ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకొంటే మొదట చిన్న చిన్న సవాళ్ళను ఇస్తోంది.

Beware! This Blue Whale online suicide challenge is scaring parents world over

ఆ సవాళ్ళను పూర్తి చేసినవాటికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయాలి. ఈ విధంగా ఒకట్రెండు రోజులు అలవాటయ్యాక గేమ్ స్థానంలో మెంటర్ ప్రవేశిస్తాడు.

భయంకరమైన చిత్రాలను చూడమనడం, ఎప్పుడు పడితే అప్పడు గాఢ నిద్ర నుండి మేల్కోనేలా ఆదేశించడం , నగ్న చిత్రాలను పంపమనడం, తమ పార్ట్ నర్ తో డేటింగ్ చేయమని చెప్పడం, వారితో డేటింగ్ చేసే వీడియోలను, పోస్ట్ చేయడం చర్మంపై వివిధ ఆకారాల్లో కత్తితో కోసుకోవడం వంటి వికృతమైన టాస్క్ లు ఇస్తాడు.

ఈ విధంగా 49 రోజుల పాటు ఏదో ఒక టాస్క్ ఇస్తూ చివరగా 50వ, రోజున ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడు గేమ్ ముగుస్తోందని మెంటర్ వారిని ఆదేశిస్తాడు. అలా చేకుండా గేమ్ నుండి బయటకు వచ్చేస్తాం అంటే వెనుక ఉన్న వ్యక్తులు వారికి బెదిరింపు కాల్స్ చేస్తారు. వెంటనే అప్పటికే గేమ్ ఆడేవారితో అనేక తప్పులు చేయించి ఉంటాడు.

కాబట్టి వారి చిత్రాలు, వీడియోలను బయట పెడతామని ఇంకా వేరే విధాలుగా చిత్రహింసలు చేస్తామని బెదిరిస్తారు. దీనితో జరిగిన విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకొనే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ఇప్పటికే ఈ గేమ్ ను సృష్టించిన ఫిల్ , లుడెకిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఆరా తీస్తున్నారు. అతడిని ఒక మానసికరోగిగా గుర్తిం,ి అతనిని మానసిక వైద్యుడి వద్ద చికిత్స అందిస్తున్నారు.

బ్రిటన్, దుబాయ్, అమెరికా, రష్యల్లో ఈ బ్లూ వేల్ గేమ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. మానసిక నిపుణులు మాత్రం ఈ గేమ్ జోలికి వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు.

English summary
A new online gaming challenge called Blue Whale has reportedly been challenging kids to commit suicide at the final stage. No, we’re not kidding, it’s actually true. What’s shocking is that it is linked to almost 100 teenage deaths in Russia and is said to have originated there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X