భారత్ సర్జికల్ స్ట్రైక్ 2.o .... సహాయం కోసం చైనాను అర్థిస్తున్న పాక్
పుల్వామా దాడితో ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన భారత్ ఎట్టకేలకు ఈ రోజు తెల్లవారుజామున సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 12 మిరేజ్ యుద్ధ విమానాలతో వెయ్యి కిలోల బాంబులతో దాడి చేసింది. కార్గిల్ వార్ తర్వాత భారత్ చేసిన అతి పెద్ద దాడి ఇది.
భారత్ జరిపిన వైమానిక దాడులతో పాకిస్థాన్ అల్లాడిపోయింది. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఇవాళ వేకువజామునే జరిగిన యుద్ధ విమానాల దాడులతో పాక్ వణికిపోయింది. వెంటనే పాకిస్థాన్ అలర్ట్ అయింది. పక్కనే ఉన్న చైనాకు ఫోన్ చేసి సాయం కోరింది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న చందంగా పాక్, చైనా సహాయాన్ని అర్థించింది.

భారత వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కి వెళ్లిన వెంటనే.. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి... చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేశారు. ప్లీజ్ సహాయం చెయ్యండి అంటూ అర్ధించారు. నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ దాటి వచ్చి దాడి చేసి వెళ్ళిన ఇండియా పై తిరిగి దాడులు చెయ్యటానికి సహకారం కావాలని కోరండి పాకిస్థాన్.
-
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
శృంగారంలో తేలియాడండి: హాలీడే ప్రకటించిన కాలేజ్ -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications