వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూటానే చెప్పింది, యుద్ధంపై మా సైన్యమే చెప్తుంది: భారత్‌కు చైనా షాక్!

భారత్-చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిహద్దులో సైనిక ప్రతిష్టంభనకు కారణమైన డోక్లామ్‌ ప్రాంతం తమది కాదని భూటాన్‌ అంగీకరించినట్లు చైనా అధికారి

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్-చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిహద్దులో సైనిక ప్రతిష్టంభనకు కారణమైన డోక్లామ్‌ ప్రాంతం తమది కాదని భూటాన్‌ అంగీకరించినట్లు చైనా అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చైనావి మాటలే తప్ప, యుద్ధం చేయకపోవచ్చు, మిలిటరీ ఆపరేషన్ కూడా! చైనావి మాటలే తప్ప, యుద్ధం చేయకపోవచ్చు, మిలిటరీ ఆపరేషన్ కూడా!

ఈ మేరకు దౌత్యమార్గాల్లో తమకు సమాచారం అందించిందని చెప్పారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదన్నారు.

భారత్‌తో యుద్ధంపై మా సైన్యమే చెబుతుంది

భారత్‌తో యుద్ధంపై మా సైన్యమే చెబుతుంది

భారత్‌తో యుద్ధానికి చైనా సిద్ధమవుతోందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయాన్ని తమ సైన్యమే చెప్పగలదని, భారత్‌ తప్పుడు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నా లేదా ఈ విషయంలో ఏమైనా భ్రమలు పెట్టుకున్నా, తమ హక్కులను పరిరక్షించుకునేందుకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఏ చర్యలయినా తీసుకునే హక్కు తమకు ఉంటుందని చెబుతోంది.

Recommended Video

Sikkim standoff: India manufactures major part of Sardar Patel Statue in China | Oneindia News
రోజురోజుకు పెరుగుతున్న చైనా స్వరం

రోజురోజుకు పెరుగుతున్న చైనా స్వరం

డోక్లాం వివాదంపై చైనా రోజు రోజుకు స్వరం పెంచుతోన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకోవాలన్న భారత్‌ సూచనను తిరస్కరిస్తోంది. కాశ్మీర్‌ లేదా ఉత్తరాఖండ్‌లోని కాలాపానీలో తాము అడుగుపెడితే ఏం జరుగుతుందని చైనా విదేశాంగ శాఖలోని సరిహద్దులు, విదేశీ వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వాంగ్ వెన్లీ వెల్లడించిన విషయం తెలిసిందే.

అదే పరిష్కారానికి మార్గం

అదే పరిష్కారానికి మార్గం

వాంగ్‌ వెన్లీ.. భారత మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడారు. డోక్లాంలో భారత సైనికులు ఒక్కరున్నా తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించినట్లేనని, భారత్‌ సైనికులందరూ వెనక్కు వెళ్లే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవని తేల్చి చెప్పారు. అలా చేయకపోతే మా ప్రభుత్వం చేతకానిదని ప్రజలు అనుకుంటారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సమస్యకు భారత బలగాలు వెనక్కి వెళ్లడమే ఏకైక పరిష్కారమన్నారు.

చైనా మట్టిలో భారత్ ఆర్మీ

చైనా మట్టిలో భారత్ ఆర్మీ

చైనా ప్రాంతంలో భారత ఆర్మీ ఉండటంపై భూటాన్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ఆమె చెప్పారు. మరోవైపు, జూన్ 16వ తేదీన పిఎల్ఓ డొక్లామ్ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం కోసం వెళ్లిందని, రాయల్ భూటాన్ ఆర్మీ దీనిని వ్యతిరేకించిందని భారత్ విదేశాంగ శాఖ చెప్పింది.

English summary
China has made another unsubstantiated claim. This time a Chinese official has said that Bhutan has acknowledged that the Doklam area where the Indian and Chinese troops are engaged in a standoff does not belong to it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X