వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం- కరోనా సోకిన ట్రంప్‌తో డిబేట్‌కు బిడెన్‌ నో....

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో అధ్యక్షుడు , రిపబ్లికన్‌ అభ్యర్ధి ట్రంప్‌ కరోనా బారిన పడటం, ఇప్పటికీ ఆయనకు కరోనా తగ్గలేదన్న ప్రచారం సాగుతుండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌తో ఇప్పటికే ఓ సారి అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో\పాల్గొన్న డెమోక్రాట్‌ అభ్యర్ధి బిడెన్‌ మరోసారి మాత్రం డిబేట్‌ వద్దంటున్నారు.

వైట్‌హౌస్ మొత్తానికీ కరోనా అంటించిన ట్రంప్? అడ్వైజర్, ప్రెస్ సెక్రెటరీ, జర్నలిస్టులకు వైరస్వైట్‌హౌస్ మొత్తానికీ కరోనా అంటించిన ట్రంప్? అడ్వైజర్, ప్రెస్ సెక్రెటరీ, జర్నలిస్టులకు వైరస్

ట్రంప్‌కు కరోనా సోకడం, ఆయన నుంచి వైట్‌హౌస్‌లో మరికొందరికి సోకిందన్న వార్తలు రావడంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయనతో పోటీపడుతున్న డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బిడెన్‌ అప్రమత్తమయ్యారు. ఈ నెల 15న అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్ జరగాల్సి ఉండగా.. ట్రంప్‌కు కరోనా తగ్గకపోతే ఈ డిబేట్‌ నిర్వహించకపోవడమే మంచిదని బిడెన్ అన్నారు. మియామీలో జరగాల్సిన ఈ డిబేట్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిడెన్‌ అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియాలో తాజాగా మీడియాతో మాట్లాడిన బిడెన్‌ ట్రంప్‌కు కరోనా తగ్గకపోతే ఈ డిబేట్‌ నిర్వహించడం మంచిది కాదన్నారు.

biden not interested of next us presidential debate with trump in wake of his condition

ట్రంప్‌ తాజా పరిస్ధితి ఏంటో తనకూ తెలియదని, అయితే ఆయన ఫిట్‌గా ఉంటే మాత్రం డిబేట్‌కు తాను సిద్ధమని, అన్ని జాగ్రత్తలు తీసుకుని డిబేట్‌ నిర్వహించాల్సిన అవసరం ఉందని బిడెన్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బిడెన్‌ ప్రచార ప్రతినిధి టిమ్‌ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్‌ రెండో డిబేట్‌ కల్లా కచ్చితంగా కోలుకుని పాల్గొంటారన్నారు. ఈ విషయంలో బిడెన్‌ అంచనాలేవీ నిజం కాబోవన్నారు.
మరోవైపు ట్రంప్‌కు కరోనా కచ్చితంగా తగ్గిందా లేదా అన్న దానిపై నిర్ధిష్ట సమాచారం లేకపోవడంతో రిపబ్లికన్‌ పార్టీ వర్గాలతో పాటు డెమోక్రాట్లలోనూ ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌ కరోనా వ్యవహారం ఎన్నికలను ఏ మలుపు తిప్పుతుందో అన్న ఆందోళన ఇరు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.

English summary
Democratic presidential candidate Joe Biden said that next week’s scheduled debate with Republican President Donald Trump should not take place if Trump is still infected with COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X