వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5000 కేజీల బాంబు పేలితే ఎట్టా ఉంటదో తెలుసా? నిర్వీర్యం చేయబోతే చివరికిలా: వైరల్ వీడియో

|
Google Oneindia TeluguNews

ఆటంబాంబులతో ఆటలాడుకునే కిమ్ జాంగ్ ప్రస్తుతం కన్నీళ్లతో కొరియన్లను క్షమాపణలు కోరుతున్నాడు.. కరోనా దెబ్బకు ప్రపంచంలో చాలా చోట్ల యుద్ధాలు నిలిచిపోయాయి.. మళ్లీ చాలా కాలం తర్వాత భారీ పేలుడు వీడియో ఒకటి బయటికి రావడంతో నిమిషాల్లోనే అది వైరల్ గా మారింది. 5వేల కేజీల భారీ బాంబు పేలితే ఎలా ఉంటుదో కళ్లారా చూసి జనం ఔరా అంటున్నారు.

జగన్, కేసీఆర్‌కు మోదీ ఫోన్ కాల్ - కేంద్రం సహాయానికి హామీ - రాష్ట్రపతి కోవింద్ కీలక సందేశంజగన్, కేసీఆర్‌కు మోదీ ఫోన్ కాల్ - కేంద్రం సహాయానికి హామీ - రాష్ట్రపతి కోవింద్ కీలక సందేశం

రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి పోలాండ్ లో బయటపడిన అతి పెద్ద బాంబును నేవీ సిబ్బంది నిర్వీర్యం చేయబోగా.. చివరికి పేలిపోయింది. 30 అడుగుల లోతులోని ఆ భారీ బాంబు ఒక్కసారే పేలడంతో.. పైకి మరో 30 అడుగుల ఎత్తువరకు నీళ్లు ఎగిసిపడ్డాయి. ఈ వైరల్ వీడియోకు సంబంధించిన ఆసక్తికర వివరాలివి..

 హిట్లర్ పీచమణిచేలా..

హిట్లర్ పీచమణిచేలా..

జర్మనీ, పోలాండ్ సరిహద్దు గుండా ప్రవహించే ఓడర్ నది నుంచి బాలిస్టిక్ సముద్రంలోకి నౌకలు ప్రయాణించేందుకు వీలుగా 18వ శతాబ్దిలోనే ఓ భారీ కాలువ నిర్మించారు. ‘పియాస్ట్ కెనాల్'గా పిలిచే ఆ కాలువను.. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ కీలక మార్గంగా వాడుకుంది. వాణిజ్యం కోసం నిర్మించిన కెనాల్ గుండా హిట్లర్ యుద్ధ నౌకల్ని పంపేవాడు. ఆ నౌకలతోపాటు కాలువను కూడా ధ్వంసం చేయాలనుకున్న బ్రిటన్ వాయుసేన.. 1945లో ఓ భారీ బాంబును జారవిడిచింది..

 పేరు.. పొడవైన బాలుడు..

పేరు.. పొడవైన బాలుడు..

టాల్ బాయ్(పొడవైన బాలుడు) లేదా ఎర్త్ క్వేక్(భూకంప) బాంబు అని ముద్దుగా పిలుచుకునే సదరు భారీ బాంబు బరువు అక్షరాలా 5400 కిలోలు. దాంట్లో నింపిన మందుగుండు బరువే 2500 కేజీలు ఉంటుందట. నాటి యుద్ధంలో పేలకుండా ఉండిపోయిన సదరు బాంబును పోలాండ్ నేవీ అధికారులు చాలా కాలం కిందటే గుర్తించారు. రకరకాల ప్లాన్లు వేసి, చివరికి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ..

తప్పిన భారీ ముప్పు..

తప్పిన భారీ ముప్పు..

రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబును నిర్వీర్యం చేయడానికి పోలిష్ మెరైన్ డైవర్లు నీటి అడుగు భాగంలో నానా తంటాలు పడినా ఫలితం రాలేదు. చివరికి అది పేలిపోయింది. అయితే పేలుడు జరిగిన సమయంలో మెరైన్ డైవర్లు డేంజర్ జోన్ వెలుపలే ఉన్నారని, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని, ముందు జాగ్రత్త చర్యగా కెనాల్ చుట్టుపక్కల సుమారు 750 మందిని ఇతర ప్రాంతాలకు తరలించామని పోలాండ్ నేవీ అధికారులు వివరించారు. మొత్తానికి బాంబు పేలిపోవడంతో భారీ ముప్పు తప్పినట్లయిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

జస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలుజస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

English summary
A British World War II bomb exploded while being made safe underwater by navy demolition specialists in northwestern Poland on Tuesday. No one was injured. Polish officials says, The device -- nicknamed "Tallboy" and also known as an "earthquake bomb" was dropped by the Royal Air Force in an attack on a Nazi warship in 1945.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X