కరోనా వ్యాప్తి తగ్గింది.. కానీ త్వరలో మరో మహమ్మారి : బిల్ గేట్స్ హెచ్చరిక
ప్రపంచాన్ని గడగడలాస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. రోజు వారి పాటిజివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గాయి. దీంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. త్వరలోనే కరోనా చివరు దశకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో మరో ప్రమాదకరమైన మహమ్మారి యావత్ ప్రపంచంపై విరుచుకుపడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన విషయాలు వెల్లడించారు.

వేరే వ్యాధికారక వైరస్ నుంచి కొత్త మహమ్మారి
ఈ కొత్త మహమ్మారి కరోనా వైరస్ నుంచి కాదని బిల్ గేట్స్ పేర్కొన్నారు. వేరే వ్యాధికారక వైరస్‌ల నుంచి ఈ కొత్త మహమ్మారి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మహమ్మారి ఎక్కువగా వృద్ధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి వ్యాధులున్నవారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఒమిక్రాన్ తట్టుకోగలిగాం..
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచ జనాభాపై తీవ్ర ప్రభావం చూపించిందని బిల్ గేట్స్ అన్నారు. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ తీసుకోవడంతో చాలా మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరిగి ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా తట్టుకోగలిగాం అని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి..
అయితే రాబోయే మహమ్మారి నుంచి కూడా సమర్థవంతంగా బయటపడగలమని బిల్‌గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని వ్యాక్సిన్‌తో పాటు కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీల కారణంగా అడ్డుకోగలమని చెప్పారు. వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఈ మహమ్మారులపై పోరాటానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70% మందికి టీకాలు వేయాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 61.9% మంది మాత్రమే ఒక డోస్ వ్యాక్సిన్ పొందారు.












Click it and Unblock the Notifications