వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసాలు మరింత కఠినతరం: టెక్కీలకు ఈ బిల్లు శరాఘాతమే!

అమెరికా మరోసారి హెచ్‌-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. ఈ వీసా జారీ నిబంధనలు కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన అత్యున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా మరోసారి హెచ్‌-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. ఈ వీసా జారీ నిబంధనలు కఠినతరం చేస్తూ రూపొందించిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన అత్యున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర వేసింది. ఇది చట్టరూపంలోకి రావాలంటే తొలుత ప్రతినిధుల సభ, అనంతరం సెనేట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేస్తే దాన్ని చట్టరూపంలోకి తీసుకొస్తారు.

30వేల డాలర్లు పెంచుతూ..

30వేల డాలర్లు పెంచుతూ..

తాజా చట్టం ప్రకారం హెచ్‌-1బీ వీసాలపై వస్తున్న నిపుణులకు ఇస్తున్న కనీస వేతనాన్ని కంపెనీలు 60వేల డాలర్లు నుంచి 90వేల డాలర్లుకు పెంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెచ్‌1బీ వీసాదారులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు కూడా వివిధ షరతులు వర్తించనున్నాయి.

అడ్డుకుంటున్న ఆంక్షలు

అడ్డుకుంటున్న ఆంక్షలు

అమెరికన్ల స్థానంలో హెచ్‌1బీ వీసాలదారులను నియమించే విధానాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. దీంతో పాటు భారత్‌ నుంచి వస్తున్న ఐటీ నిపుణులకు పలు ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును పొందుపరిచింది.

అమెరికా ఉద్యోగులకు రక్షణ

అమెరికా ఉద్యోగులకు రక్షణ

ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌(హెచ్‌ 170) కింద ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ బిల్లు ద్వారా అమెరికన్ల ఉద్యోగులను భర్తీ చేయకుండా.. హెచ్‌-1బీ వీసాదారులను నియమించడాన్ని అడ్డుకుంటారు. అమెరికా ఉద్యోగులను రక్షిస్తూ.. కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు ఇది దోహదపడుతోందని కాంగ్రెస్‌ నేత ఇస్సా అన్నార.

అమెరికాకే ప్రమాదం

అమెరికాకే ప్రమాదం


ఇది ఇలావుంటే.. ఈ చట్టాన్ని నాస్కామ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ చట్టం అమెరికా వ్యాపార రంగానికి కూడా ప్రమాదామేనని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖరన్‌ వివరించారు. ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారత టెక్కీలకు ఈ చట్టం పెద్ద ఇబ్బందికర పరిణామమనే చెప్పవచ్చు.

English summary
A key Congressional committee on Wednesday voted to pass a legislation that proposes to increase the minimum salary of H-1B visa holders from $60,000 to $90,000 and imposes a number of restriction on the work visa popular among IT professionals from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X