ఒక్క ట్వీట్.. దుమ్ము రేపుతోంది: అమెజాన్ సీఈవో అలా అడగడమే ఆలస్యం!

Subscribe to Oneindia Telugu

లాస్ ఏంజిల్స్: ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన అమెజాన్ సీఈవో జెఫ్ బీజోస్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర ప్రకటన చేశారు. తన సంపాదన నుంచి భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని.. దేనికోసం ఖర్చు చేస్తే బాగుంటుందో చెప్పాలంటూ నెటిజెన్స్ ను కోరారు.

ఐడియా ఇవ్వమంటూ ఆయన ట్వీట్ చేయడమే ఆలస్యం 15వేల మంది నెటిజెన్స్ దానిపై స్పందించారు. 10వేల లైక్స్, 15వేల రిప్లైలతో ఈ ట్వీట్ ట్విట్టర్ లో జోరుగా దూసుకెళ్తోంది. తన సంపాదనలో ఎక్కువ భాగం ఇప్పటికే దానాలకు వినియోగిస్తున్నానని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్న ఉద్దేశంతోనే నెటిజెన్స్ ను ఐడియాలు ఇమ్మంటూ కోరానని బీజోస్ తెలిపారు.

సంపూర్ణ ప్రభావం చూపించేలా, శాశ్వత పరిష్కారం కలిగించేలా..ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ఒకవేళ ఇలా ప్రకటించడం తప్పని భావిస్తే.. ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా చెప్పాలంటూ కోరారు.

దీనిపై పలువురు స్పందించిన పలువురు నెటిజెన్స్.. అమెరికాలో విద్యకు చాలామంది దూరమవుతున్నారని, ఎక్కువమంది నిరాశ్రయులుగా ఉన్నారని.. కాబట్టి వారికి సహాయం చేయాలని కోరారు. మరికొంతమంది నెటిజెన్స్.. విద్యార్థుల విద్యా రుణాలను తీరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amazon.com Inc's billionaire founder Jeff Bezos on Thursday turned to an unusual source of inspiration for how to donate part of his wealth: Twitter.
Please Wait while comments are loading...