Bird Flu: పెరూలో బర్డ్ ప్లూ కలకలం.. వైరస్ సోకి 55,000 పక్షులు, 585 సముద్ర సింహాల మృతి..
పెరూలో బర్డ్ ప్లూ కారణంగా 55,000 పక్షులు, 585 సముద్ర సింహాలు మృతి చెందాయి.
కరోనా.. ఈ మహమ్మారితో ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. ఈ వైరల్ దెబ్బకు ఎంతో మంది చనిపోయారు. కొవిడ్ కారణంగా అనేక దేశాల్లో లాక్ డౌన విధించారు. దీంతో చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతున్నాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే తాజాగా మరో వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అదే బర్డ్ ప్లూ.. ఈ వైరస్ ఎక్కువగా పక్షులకు వస్తుంది. కానీ తాజాగా సముద్ర సింహాలు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడ్డాయి.

585 సముద్ర సింహాలు
పెరూలోని 8 తీర ప్రాంతాల్లో చనిపోయిన పక్షులు, సముద్ర సింహాలను పరీక్షిస్తే..అవి బర్డ్ ఫ్లూ ద్వారా మృతి చెందినట్లు సెర్నాన్ప్ నేచురల్ ఏరియా ప్రొటెక్షన్ ఏజెన్సీ పేర్కొంది. ఎనిమిది రక్షిత తీర ప్రాంతాలలో 55,000 చనిపోయిన పక్షులను పూడ్చి పెట్టారు.
585 సముద్ర సింహాలను కూడా పూడ్చేశారని సెర్నాన్ప్ సహజ ప్రాంతాల రక్షణ సంస్థ తెలిపింది. చనిపోయిన పక్షులలో పెలికాన్‌లు, వివిధ రకాల గల్లు, పెంగ్విన్‌లు ఉన్నాయని సెర్నాన్ప్ ఒక ప్రకటనలో వివరించింది. చనిపోయిన సింహాల్లో H5N1 వైరస్ ఉన్నట్లు ల్యాబ్ పరిక్షల్లో తేలిందని తెలిపారు.

37,000 కోళ్లు
పెరూ నేషనల్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ (SERFOR) బీచ్‌లో సముద్ర సింహాలు, సముద్ర పక్షులకు దూరంగా ఉండాలని సూచించింది.డిసెంబరులో పెరువియన్ అధికారులు గతంలో వన్యప్రాణులను ప్రభావితం చేసిన బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల ఫారమ్‌లో 37,000 కోళ్లను చంపారు. వ్యాధి సోకిన పక్షులను చంపడం అనేది ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వ్యాప్తిని నియంత్రించడానికి సాధారణ చర్యగా పరిగణిస్తారు.

2021 చివరి నుంచి
2021 చివరి నుంచి యూరప్ లో బర్డ్ ఫ్లూ పెరుగుతోందట. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ఈ వ్యాధి ఉందట. ఈ వైరస్ ఇది వరకు పక్షి చెందిన వాటికి మాత్రమే వ్యాపించేది.. కానీ ఇప్పుడు జంతువులకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది. ఇటీవల బ్రిటన్‌లోని నక్కలు, ఫ్రాన్స్‌లోని పిల్లిలో ఈ వైరస్ ను గుర్తించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications