కెమికల్ ప్లాంట్‌లో వరుస పేలుళ్లు: 19మంది మృతి
బీజింగ్: చైనాలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
చెంగ్డులోని యిబిన్ హెంగ్డా టెక్నాలజీ రసాయనిక కర్మాగారంలో ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా, పది నిమిషాల వ్యవధిలోనే ఏడు పేలుళ్ల శబ్ధాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

పేలుళ్ల ధాటికి కర్మాగారంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంత మంటలు, పొగలతో కమ్ముకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
కర్మాగారంలో పేలుళ్లుకు సమీపంలోని భవనాలు అద్దాలు పగిలిపోవడం గమనార్హం.
కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications