మిలిటరీ రెస్టారెంట్‌లో పేలుడు: 8మంది మృతి, 15మందికి గాయాలు
పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. లాహోర్‌లోని మిలిటరీ ఏరియాలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడుకు కారణాలు తెలియరాలేదు.
లాహోర్: పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. లాహోర్‌లోని మిలిటరీ ఏరియాలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడుకు కారణాలు తెలియరాలేదు.

కాగా, జనరేటర్ బ్లాస్ట్ కావడం వల్ల పేలుడు జరిగినట్లు స్థానిక పంజాబ్ ప్రభుత్వం ట్విట్టర్‌లో పేర్కొంది. రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఫెన్స్ ఏరియలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పేలుడు జరిగినట్లు తెలిపారు. దాని వల్ల సమీపంలో ఉన్న భవనాలు ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనలో గాయపడిన 15 మందిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ప్రాంతాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications