మిలిటెంట్స్: గదుల్లో కుక్కి మళ్లీ మళ్లీ రేప్, పెళ్లి చేసుకొని మరొకరికి

డాలోరీ: బోకోహారమ్ మిలిటెంట్స్ సామూహికంగా మహిళల పైన అత్యాచారానికి పాల్పడుతున్నారని నైజీరియన్ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో తమ పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బోకోహారమ్ మిలిటెంట్లు నైజీరియా ప్రాంతంలో వందలాది మంది మహిళలు, యువతులు, బాలికలను చెరబడుతున్నారు.

వారిని గదులలో కుక్కి, బలవంతంగా వారి కోర్కెలు తీర్చుకుంటున్నారు. వారిపై మళ్లీ మళ్లీ రేప్ చేస్తున్నారు. ఈ విషయాన్ని 25 ఏళ్ల మహిళ చెబుతూ వాపోయారు. మైదుగురి అనే ప్రాంతంలో సైన్యం ఉగ్రవాదుల పైన దాడులను తీవ్రం చేసి విడిపించింది. వారిలో 25 ఏళ్ల హమ్సతూ బయటపడింది.

 Boko Haram Militants Raped Hundreds of Female Captives in Nigeria

ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పింది. బోకోహారమ్ కొత్త తరాన్ని సృష్టించే పని పెట్టుకుందని, పుట్టే బిడ్డలకు తండ్రెవరో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి వివాహం చేసుకొని మరికొందరికి తన భార్యను అప్పగిస్తున్నారని చెప్పింది.

నిలదీస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. సైన్యం వల్ల ఉగ్రవాదుల నుండి బయటపడ్డ వారిలో చాలామంది గర్భవతులు ఉన్నారు. చిన్నారులను కూడా మిలిటెంట్స్ వదల్లేదు. కాగా, సైన్యం దాడులతో బోకోహారమ్ కొంత వెనుకడుగు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+