వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్‌లో బస్సులో పేలిన బాంబు: 15మంది మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుని వెళ్తోన్న బస్సులో బాంబు పేలి 25 మృతిచెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నార్త్ ఈస్ట్ పాకిస్థానీ పట్టణం పెషావర్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.... 40 మంది ప్రయాణికులతో మార్దాన్‌ నుంచి బయలుదేరిన బస్సు పెషావర్‌లో రద్దీగా ఉండే సరద్ ప్రాంతంలోని మసీదు రోడ్డులో బస్సు ఆగిన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. మృతుల్లో 10మంది పాక్‌ సచివాలయ ఉద్యోగులేనని పోలీసులు తెలిపారు.

క్షతగాత్రుల్ని స్థానిక లేడీ రీడింగ్‌ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని కంటోన్మెంట్ ఆస్పత్రికి కూడా తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాంబు పేలుడు ధాటికి తునాతునకలైన బస్సు 30 నుంచి 40 అడుగుల దూరం ఎగిరి పడినట్టు ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు.

బస్సులో ఇలాంటి బాంబు దాడులు జరగడం ఇది మూడోసారని అధికారులు తెలిపారు. 2013లో ఇలాగే పెషావర్‌ వద్ద బస్సులో బాంబు పేలుడు సంభవించడంతో సివిల్‌ సెక్రటేరియట్‌కి చెందిన 19 మంది అధికారులు మృతిచెందగా మరో 44 మంది గాయపడ్డారు.

English summary
Pakistani police say a bomb blast has ripped through a bus carrying government employees in northwestern city of Peshawar, killing 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X