పాక్‌లో బ్లాస్ట్: 39మంది మృతి, నైజీరియాలో కాల్చివేత

Bomb rips through historic market in Pakistan's Peshawar, kills 39
ఇస్లామాబాద్/కానో: వాయువ్య పాక్‌లోని పెషావర్‌లో జరిగిన బాంబు పేలుడులో 39 మంది మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ పట్టణం వరుస బాంబు పేలుళ్లతో అట్టుడుకుతోంది. తాజా ఘటనతో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడు బాంబు పేలుళ్లలో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం ఉదయం పెషావర్‌లోని కిస్సా ఖవానీ బజార్‌లో పోలీసు స్టేషన్‌కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.
నిలిపి ఉంచిన కారులో సుమారు 225 కేజీల పేలుడు పదార్థాలను ఉంచి రిమోట్ ద్వారా దుండగులు వాటిని పేల్చివేశారు. పేలుడు ధాటికి సమీపంలోని 8 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

గాయపడిన వారిని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల వ్యవధిలో పెషావర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఇది మూడోది. గత ఆదివారం చారిత్రక చర్చిలో జరిగిన బాంబుదాడిలో 80 మందికి పైగా చనిపోగా, శుక్రవారం ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సులో సంభవించిన పేలుడులో 19 మంది మృత్యువాతపడ్డారు.

50 మంది విద్యార్థుల కాల్చివేత

నైజీరియాలో నిద్రిస్తున్న 50 మంది విద్యార్థులను దారుణంగా ఉగ్రవాదులు హతమార్చారు. ఈశాన్య నైజీరియాలోని ఓ కళాశాల హాస్టల్‌లోకి చొచ్చుకెళ్లిన బొకోహారం మిలిటెంట్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆదివారం తెల్లవారుజామున మిలిటెంట్లు వ్యవసాయ కళాశాల హాస్టల్‌లోకి దూసుకెళ్లారని, నిద్రిస్తున్న విద్యార్థులను విచక్షణారహితంగా కాల్పులు జరిపి హతమార్చారని అధికార వర్గాలు తెలిపాయి.

50 మంది మరణించినట్టు అధికారికంగా చెబుతున్నా, ఇంకా అనేకమంది జాడ తెలియనందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండు వ్యానులు నిండిపోయిన మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్టుగా వెల్లడించారు. ఈ ఘటన తరువాత ఆ సంస్థకు మిలిటెంట్లు నిప్పు పెట్టారని, వెయ్యిమందికి పైగా విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారని రాష్ట్ర సైనిక ప్రతినిధి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+