మసీదులో ప్రార్థన టైంలో ఆత్మహుతి దాడి: పాకిస్తాన్‌లో 22 మంది మృతి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మహ్మద్ ట్రైబల్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సూసైడ్ బాంబు దాడిలో 22 మంది వరకు మృతి చెందారని తెలుస్తోంది. మరో 35 మంది గాయపడ్డారు.
శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు మసీదులోకి చొరబడ్డాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని పేయిఖాన్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

అక్బర్ అనే అధికారి మాట్లాడుతూ.. 20 మందికి పైగా గాయపడ్డారని, ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ వారిని పెషావర్ ఆసుపత్రికి విమానంలో తరలించినట్లు చెప్పారు. ఈ దాడిని జమాత్ ఉల్ అహ్రర్ అనే ఉగ్రసంస్థ చేసినట్లుగా ప్రకటించింది. ఇది పాక్ తాలిబన్ గ్రూప్ సంస్థ.












Click it and Unblock the Notifications