భయంకరమైన దాడి: థ్రిల్ కోసం ఏం చేశాడో చూడండి

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె వీపుపై పెద్ద గాయం చేసిన సంఘటన చైనాలోని చెంగ్డు పట్టణంలో చోటు చేసుకుంది. జులై 1న జరిగిన ఈ సంఘటన స్థానికంగా పెను కలకలాన్ని సృష్టించింది.

ఈ దాడిలో బాధితురాలి వీపుపై కత్తి పన్నెండున్నర ఇంచెల లోపలికి చొచ్చుకుపోయింది. దీంతో బాధితురాలు ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఇదే తరహాలో మరో ముగ్గురిపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన సమాధానంతో పోలీసులు కంగుతిన్నారు.

Bored man ‘deliberately slashes woman’s back because he was looking for a THRILL’

బోర్ కొట్టడంతో.. కేవలం థ్రిల్ కోసం ఈ పని చేసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు. రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళలే అతడి టార్గెట్‌. మోటార్ సైకిల్‌పై వేగంగా వచ్చి పదునైన కత్తితో నిందితుడు దాడి చేసేవాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయేవాడు.

నిందితుడు చేసిన దాడిలో ఒక బాధిత మహిళకు వీపుపై సుమారు 32 కుట్లు పడ్డాయి. ఈ దాడిలో గాయపడిన వారి బాధ వర్ణనాతీతం. అయితే స్థానికులు ఈ ఫోటోలను తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో ఇది వెలుగు చూసింది. చూసేందుకు కూడా ఫోటోలు దారుణంగా ఉన్నాయి.

Bored man ‘deliberately slashes woman’s back because he was looking for a THRILL’

మరో ఇద్దరిపై కూడా ఇదే తరహాలో దాడికి పాల్పడటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన ఈ ఘటనకు కారణమైన 31 ఏళ్ల జంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం బోర్ కొట్టడంతో.. థ్రిల్ కోసం ఇలా చేశానని విచారణలో చెప్పడంపై అతడిని ఉరితీయాలనే డిమాండ్ ఊపందుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young woman walking on the street was allegedly slashed across her neck wiht a knife by a 'bored' male cyvlist on the eveninig of july 1 in chengdu city, china.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి