వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృత్రిమ కాలుతో డాన్స్ చేసిన బాలుడు ,వైరల్ అవుతున్న వీడియో

|
Google Oneindia TeluguNews

అభంశుభం తెలియని వయస్సు పిల్లలందరితోపాటు ఆడుకోవాలనే ఆకాంక్ష, బయటికి వెళ్లి ఏదో చేయాలనే బలమైన ఆలోచన కాని విధి వక్రీకరించింది. ఎనిమిది నెలల వయస్సున్న బాలుడు రెండు గ్రూపుల మధ్య ఎదురు కాల్పుల్లో బుల్లెట్ తగిలి కాలును పోగొట్టుకున్నాడు. అయితే గత నాలుగేళ్లుగా క‌ృత్రిమ కాలును అమర్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు డాక్టర్లు, చివరగా కృత్రిమ కాలును ‌అమర్చారు. ఇంకేముంది బాలుడి సంతోషానికి అవదులు లేవు, కాలుపెట్టిన ఆసుపత్రిలోనే గంతులు వేశాడు. తిరిగి కాలు వచ్చింది చూడడంటూ ఆసుపత్రిలోరి రోగులను నవ్విస్తూ డాన్స్ చేస్తున్న వీడియో ఓవైపు సంతోషాన్ని కల్గిస్తూనే మరోవైపు అందరిని ఆకర్షిస్తోంది.

రెండు గ్రూపుల మధ్య ఎదురు కాల్పుల్లో కాలునను పోగొట్టుకున్న బాలుడు

రెండు గ్రూపుల మధ్య ఎదురు కాల్పుల్లో కాలునను పోగొట్టుకున్న బాలుడు

మనిషికి అవయవాలు ఉండడం ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. శరీరంలో ఏ ఒక్క భాగం లేకపోయినా అది మనిషి జీవీతం మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటీది ఓ చిన్నారి బాలుడు, పసిప్రాయాంలోనే విధి వక్రీకరించింది. ఎనిమిది నెలల వయస్సులోనే అఫ్గానిస్తాన్ లోని తాలిబాన్లకు మరియు అఫ్గానిస్తాన్ దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో ఎనిమిది నెలల అహ్మద్ సయ్యద్ రహ్మాన్ అనే బాలుడికి బుల్లెట్ తగిలింది. దీంతో బాలుడి కాలును తొలిగించారు.

బీదరికంలో అహ్మద్ కుటుంభం, స్పందించిన స్థానిక ఐసిఆర్సి డాక్టర్స్

బీదరికంలో అహ్మద్ కుటుంభం, స్పందించిన స్థానిక ఐసిఆర్సి డాక్టర్స్

తనకు సంబంధం లేకున్నా రెండు గ్రూపుల మధ్య కాల్పుల్లో తన కాలును పోగొట్టుకున్న అహ్మద్ కుటంభం కడు బీదరికంలో కొనసాగుతోంది. రోజువారి అవసరాలకే జీవనం కష్టం అవుతుంటే, ఇంకా పోయిన కాలు స్థానంలో తిరిగి కృత్రిమ కాలును తెచ్చుకోవడం కష్టమే అవుతుంది ఆ కుటుంభానికి, కాని వారి దయనీయ స్థితిని తెలుసుకున్నకృత్రిమ అవయవాలు ఆసుపత్రి ఐసిఆర్సి స్పందించింది. అహ్మద్‌కు కావాల్సిన వైద్యచికిత్సను గత నాలుగేళ్లుగా అందిస్తున్నారు. దీంతో పలురకాల కృత్రిమ కాళ్లను బాలుడికి అమరుస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే మరోసారి అహ్మద్ కు కృత్రిమ కాలును అమర్చారు.

పట్టరాని సంతోషంతో ఆసుపత్రిలోనే డాన్స్

దీంతో అమర్చిన కాలు బాగా ఉండడంతో ఆహ్మద్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక నుండి తాను కూడ అందరిపిల్లలతోపాటు సమానంగా ఆడుకునే పరిస్థితి వచ్చిందనుకున్నాడు కావచ్చు. ఆసుపత్రిలోనే చుట్టు తిరుగుతూ డాన్స్ చేశాడు. అయితే అహ్మద్ డాన్స్ చూసిన నెటిజన్లు తమ పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీడీయోను వేలాదిగా షేర్ చేస్తున్నారు.

English summary
A heartwarming video of a Afghan boy dancing with pure joy in hospital after getting a prosthetic leg is going viral online.The little boy, whose name is Ahmad Sayed Rahman, recently got fitted with a new prosthetic leg
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X