మరో అంతర్జాతీయ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ.. మొత్తం 26 పురస్కారాలతో రికార్డ్..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు. అయితే ప్రధాని మోదీని ఆ దేశ అత్యుత్తమ పౌర పురస్కారం వరించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో డ సిల్వా ఈ అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. దీంతో మొత్తం 26 దేశాల నుంచి అత్యుత్తమ పౌర పురస్కారం అందుకున్న తొలి నేతగా ప్రధాని మోదీ రికార్డు సాధించారు.
ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించి సత్కరించారు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో డ సిల్వా. ఈ మేరకు బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ ను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో డ సిల్వా .. ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.

అనంతరం ప్రధాని మోదీ అక్కడి మీడియా సమావేశంలో ప్రసంగించారు. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం అందజేత నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతోందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భారత్- బ్రెజిల్ మధ్య రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య, క్లీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ తదితర రంగాల్లో వృద్ధి సాధించాలని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తత, ఒత్తిడి పరిస్థితులు నెలకున్నాయని.. ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన చర్చలతోనే శాంతి స్థాపనకు మార్గం ఉంటుందని తెలిపారు.
Another accolade to his name! 🏅
— BJP (@BJP4India) July 8, 2025
President Lula bestowed Brazil's highest civilian honour, the ‘Grand Collar of the National Order of the Southern Cross,’ upon PM Modi. pic.twitter.com/Qub8nwhNxL
ఈ అవార్డుతో మొత్తం 26 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు సాధించిన నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఇక జులై 2న ప్రధాని మోదీ విదేశీ పర్యటన ప్రారంభం అయింది. ఐదు దేశాల పర్యటన జులై 9 వరకు కొనసాగనుంది. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ పర్యటనలను పూర్తిచేసుకున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత నమీబియాలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications