యువతిపై 30 మంది మాస్ రేప్: ట్విట్టర్‌లో వీడియో

బ్రెజిల్: సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ మాస్ రేప్ వీడియో బ్రెజిల్‌ను వణికిస్తోంది. బ్రెజిల్‌లో జరిగిన ఆ అత్యాచర ఘటన వెన్నులో చలి పుట్టిస్తోంది. 16 ఏళ్ల యువతిపై 30 మంది పురుషులు మృగాల మాదిరిగా విరుచుకుపడ్డారు. ఒకరి తర్వాత ఓకరు తమ కామవాంఛ తీర్చుకున్నారు.

బ్రెజిల్‌లోని రియో డీ జనైరో ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఆ 16 సంవత్సరాల యువతి జీవితాన్ని సర్వనాశనం చేశారు. అత్యాచారం దృశ్యాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పుశువుల మాదిరిగా వ్యవహరించారు. రేప్ వీడియోలను, చిత్రాలను నెట్‌లో పోస్ట్ చేశారు. పోలీసులు యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వార్తాకథనాలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. శనివారంనాడు తన బాయ్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లే సమయంలో ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెల్లారి లేచేసరికి ఆమె మృగాళ్ల మధ్య వేరే ఇంట్లో కనిపించింది.

Brazil shocked as police search for 30 men who gang raped 16 year old girl

బాయ్‌ఫ్రెండ్‌పైన, ఇతరులపైనా అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పరస్పర విరుద్ధ ఘటనలు వస్తన్నాయి. తాను ఆదివారంనాడు లేచానని, తాను నగ్నంగా గాయపడి ఉన్నానని బాధితురాలు చెప్పినట్లు ఓ ప్రకటన తెలియజేస్తోంది. అత్యాచార ఘటనకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టినట్లు ఆమెకు మర్నాడు తెలిసింది.

దాదాపు 40 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో ఘోరంగా షేర్ అవుతూ వస్తోంది. దాన్ని ఆపడానికి యూజర్ ఖాతాలను సస్పెండ్ చేశారు. ఆ వీడియో చూసి, కన్నీరు మున్నీరుగా విలపించామని బాధితురాలి అమ్మమ్మ స్థానిక మీడియాతో ఆవేదనాభరితమైన హృదయంతో చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+